RR vs GT, IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో నేడు రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్ టైటాన్స్‌ (RR vs GT) రెండో సారి తలపడుతున్నాయి. రెండు జట్లూ బెస్ట్‌ ఆఫ్ బెస్ట్‌ కావడంతో అభిమానులు మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మ్యాచ్‌ అప్స్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో హైప్‌ చాలా  పెరిగింది. అందుకు ఈ గణాంకాలే నిదర్శనం.


* పవర్‌ ప్లేలో అత్యంత వేగంగా పరుగులు చేస్తున్న ఏకైక జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌. 9.6 రన్‌రేట్‌తో అగ్రెసివ్‌గా ఆడుతోంది. అయితే పవర్‌ప్లేలో అత్యంత ఎకనామికల్‌గా బౌలింగ్‌ చేసిన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌. ఓవర్‌కు 7.3 చొప్పునే రన్స్‌ ఇచ్చింది.


* డెత్‌ ఓవర్లలోనూ అత్యధిక స్కోరింగ్‌ ఉన్న జట్లు ఇవే. ఆఖరి నాలుగు ఓవర్లలో టైటాన్స్‌ ఓవర్‌కు 12 పరుగులు చేస్తుండగా రాయల్స్‌ 11.7 పరుగులు చేస్తోంది. ఇక టైటాన్స్‌ స్పిన్నర్లు 15.5 బంతులకు వికెట్‌ తీస్తుండగా రాయల్స్‌ 16.2 బంతులకు తీస్తోంది.


* ఈ సీజన్లో యశస్వీ జైశ్వాల్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో అసలు ఔటే కాలేదు. స్పిన్నర్ల బౌలింగ్‌లో 93 బంతులు ఎదుర్కొని 139 పరుగులు చేశాడు. అతడు కొట్టిన 18 సిక్సుల్లో స్పిన్నర్ల బౌలింగ్‌లోనే 7 కొట్టాడు. అయితే పేస్‌తో అతడిని అడ్డుకోవచ్చని పొరపాటు పడొద్దు. పేసర్ల బౌలింగ్‌లో 3.1 బంతికే బౌండరీ కొడుతున్నాడు.


* గుజరాత్ టైటాన్స్‌పై యశస్వీ జైశ్వాల్‌ 25 పరుగులు చేస్తే అరుదైన రికార్డు అందుకుంటాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్‌ తెందూల్కర్‌ (31 ఇన్నింగ్స్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (31) అతడి కన్నా ముందుంటారు.


* టీ20 క్రికెట్లో సంజూ శాంసన్‌పై శివమ్‌ మావికి మంచి రికార్డుంది. 25 బంతుల్లో 34 పరుగులు ఇచ్చి 5 సార్లు ఔట్‌ చేశాడు. ఈ మ్యాచులో టైటాన్స్‌ అతడిని బరిలోకి దించుతుందేమో చూడాలి.


* సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చి కాసేపు నిలిస్తే టైటాన్స్‌కు ముప్పుగా మారతాడు. ఎందుకంటే చివరి గేమ్‌లో రషీద్‌ ఖాన్‌ను అతడు ఊచకోత కోశాడు. 9 బంతుల్లోనే 28 రన్స్‌ చేశాడు. మొత్తంగా 92 బంతుల్లో 109 రన్స్‌ కొట్టి ఒక్కసారే ఔటయ్యాడు.


* హార్దిక్‌ పాండ్య స్పిన్‌ను ఊచకోత కోస్తాడు. అయితే యుజ్వేంద్ర చాహల్‌పై బెటర్‌ రికార్డేమీ లేదు. 55 బంతుల్లో 48 పరుగులు చేసి మూడు సార్లు ఔటయ్యాడు. అయితే మిల్లర్‌కు మంచి రికార్డుంది. చాహల్‌ బౌలింగ్‌లో 52 బంతులు ఆడి 96 రన్స్‌ కొట్టాడు. మూడు సార్లు ఔటయ్యాడు. 


*  ఈ సీజన్‌ ఆరంభంలో జోస్‌ బట్లర్‌ అద్భుతంగా ఆడాడు. మొదటి 4 మ్యాచుల్లోనే 204 పరుగులు చేశాడు. 170 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. రీసెంట్‌ ఐదు మ్యాచుల్లో కేవలం 85 పరుగులు చేశాడు.


* కుడి చేతి వాటం బ్యాటర్లకు ఆఫ్‌ స్పిన్‌ ఎక్కువగా పని చేయదని అంటారు. అయితే అశ్విన్‌ మాత్రం భిన్నం. అతడు తీసిన వికెట్లలో తొమ్మిది వీరివే. లీగులో రైట్‌ హ్యాండర్లను ఔట్‌ చేసిన వారిలో టాప్‌4లో నిలిచాడు.