Piyush Chawla And Kedar Jadhav: ఐపీఎల్ 2023 ఇప్పటివరకు చాలా మంది ఆటగాళ్ల నుంచి గొప్ప ప్రదర్శనలను చూసింది. గత సీజన్‌లో అంటే ఐపీఎల్ 2022లో కామెంటేటర్లుగా ఉంటూ ఈ సీజన్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు చెందిన పీయూష్ చావ్లా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన కేదార్ జాదవ్, లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన అమిత్ మిశ్రా ఈ జాబితాలో ఉన్నారు.


ఐపీఎల్ 2022లో పీయూష్ చావ్లా వ్యాఖ్యాతగా కనిపించాడు. ఐపీఎల్ 2023లో ఆర్సీబీలో చేరిన కేదార్ జాదవ్, ఈ సీజన్‌లో కూడా వ్యాఖ్యాతగా పనిచేశాడు. కానీ బౌలింగ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లీ స్థానంలో జాదవ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేర్చారు.


పీయూష్ చావ్లా
ఐపీఎల్ 2022 మెగా వేలంలో పీయూష్ చావ్లాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీని తర్వాత అతను ఆ సీజన్‌ మొత్తానికి కామెంటేటర్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో, IPL 2023 కోసం జరిగిన మినీ వేలంలో పీయూష్ చావ్లాను ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసి జట్టులో చేర్చుకుంది.


ఈ సీజన్‌లో పీయూష్ చావ్లా అత్యుత్తమ ఫామ్‌లో కనిపించాడు. ముంబై ఇండియన్స్ స్పిన్నర్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2023లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 17 సగటుతో 15 వికెట్లు తీసుకున్నాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 7.29గా ఉంది. అంతకుముందు 2021లో కూడా అమిత్ మిశ్రా ముంబై ఇండియన్స్‌ జట్టులోనే భాగంగా ఉన్నాడు.


అమిత్ మిశ్రా
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న అమిత్ మిశ్రా, గత సీజన్‌లో ఐపీఎల్‌లో పాల్గొనని ఆటగాళ్లలో కూడా ఉన్నాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్ 2022 టోర్నమెంట్‌లో భాగం కాదు. కానీ ఈ సీజన్ (ఐపీఎల్ 2023) కోసం అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అమిత్ మిశ్రా 18.17 సగటుతో ఆరు వికెట్లు తీసుకున్నాడు.


కేదార్ జాదవ్
మరోవైపు, ఐపీఎల్ 2023లో RCBలో చేరిన కేదార్ జాదవ్, టోర్నమెంట్ కోసం జరిగిన మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఆ తర్వాత కామెంటరీ చేయడం మొదలుపెట్టాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లీ గాయపడటంతో, కేదార్ జాదవ్‌కు రూ. కోటి ధర చెల్లించి జట్టులోకి తీసుకున్నారు. కేదార్ జాదవ్ కూడా ఇంతకు ముందు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడాడు. ఆర్‌సీబీ తరఫున ఇప్పటి వరకు మొత్తం కేదార్ జాదవ్ 17 మ్యాచ్‌లు ఆడాడు.


ఐపీఎల్‌ 2023 సీజన్ 47వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి పాలైంది. చివరి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన దశలో కేవలం 32 పరుగులు మాత్రమే ఓడిపోయింది. చివరి ఐదు ఓవర్లలో మూడు ఓవర్లను వేసిన వరుణ్ చక్రవర్తి తన 18 బంతుల్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్ ఓటమి రాత రాశాడు.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్‌కతా తరఫున రింకూ సింగ్ (46: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి ఐదు ఓవర్లలో కోల్‌కతా కేవలం 42 పరుగులే చేయగలిగింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (41: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అత్యధిక పరుగులు సాధించాడు.