IPL 2023, CSK vs RR: 


చెపాక్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. స్లో టర్నర్‌.. బ్యాటర్లకు అనుకూలించని పిచ్‌పై డిఫెండబుల్‌ స్కోరే చేసింది. 8 వికెట్ల నష్టానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 176 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (52; 36 బంతుల్లో 1x4, 3x6) హాఫ్‌ సెంచరీ కొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (38; 26 బంతుల్లో 5x4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (30; 22 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (30*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. ఆకాశ్ సింగ్‌, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే తలో రెండు వికెట్లు పడగొట్టారు.






మూమెంటమ్‌ విడవలేదు!


తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్దే ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ (10) ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ (38) తెలివిగా బ్యాటింగ్ చేశాడు. బట్లర్‌తో కలిసి బౌండరీలు బాదాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి రాయల్స్‌ 57/1తో నిలిచింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 41 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం అందించారు. స్కోరు వేగం పెంచే క్రమంలో భారీ షాట్‌ ఆడిన పడిక్కల్‌... రవీంద్ర జడేజా వేసిన 8.3వ బంతికి ఔటయ్యాడు. మరో రెండో బంతులకే కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (0) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 88.


వికెట్లు పడుతున్నా రాయల్స్‌ దూకుడు తగ్గించలేదు. అశ్విన్‌, బట్లర్‌ కలిసి నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో 47 పరుగుల భాగస్వామ్యం అందించారు. సీఎస్కే బౌలర్లపై యాష్‌ ఎదురుదాడి చేశాడు. కీలక సమయంలో అతడిని ఆకాశ్ సింగ్‌ ఔట్‌ చేశాడు. 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందున్న బట్లర్‌ను మొయిన్‌ అలీ పెవిలియన్‌ పంపించాడు. అయితే ఆఖర్లో విండీస్‌ వీరుడు హెట్‌మైయిర్‌ మంచి హిట్టింగ్‌తో స్కోరును 175/8కి చేర్చాడు.






చెన్నై సూపర్‌ కింగ్స్‌ : డేవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌, అజింక్య రహానె,  మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, మహీశ్‌ థీక్షణ, ఎంఎస్‌ ధోనీ, సిసంద మగల, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్‌ సింగ్‌


రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జురెల్‌, జేసన్ హోల్డర్‌, రవిచంద్రన్ అశ్విన్‌, కుల్‌దీప్‌ సేన్‌, సందీప్‌ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌