CSK vs RR, IPL 2023:
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సీఎస్‌కే కెప్టెన్‌గా అతడికి ఇది 200 మ్యాచ్. ఈ నేపథ్యంలో ఆ ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్ మహీని సన్మానించాడు.
'మేం తొలుత బౌలింగ్ చేస్తాం. పిచ్ కాస్త మందకొడిగా ఉండొచ్చు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. డ్యూ ఇంపాక్ట్ ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ టీమ్‌కు ఉపయోగపడుతుంది. ఐపీఎల్‌లో 200 మ్యాచులకు కెప్టెన్సీ చేయడం బాగుంది. అభిమానులు ఎంతో ఆదరిస్తున్నారు. మొదట్లో మేం పాత స్టేడియంలో ఆడేవాళ్లం. అది చాలా వేడిగా, ఉక్కపోతగా ఉండేది. కానీ ఇప్పుడు స్విట్జర్లాండులో ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. గతంతో పోలిస్తే టీ20లు చాలా మారాయి. అభిమానులు రావడం ఆనందంగా ఉంది. గాయాలతో కొందరు అందుబాటులో లేరు. మిచెల్ శాంట్నర్, ప్రిటోరియస్ స్థానాల్లో థీక్షణ, మొయిన్ వస్తున్నారు' అని ధోనీ చెప్పాడు.
'టాస్ గెలిస్తే మేమూ తొలుత బౌలింగే చేసేవాళ్లం. ఈ సీజన్‌ను మేం అద్భుతంగా మొదలుపెట్టాం. ఇదే మూమెంటమ్ కొనసాగించాలని అనుకుంటున్నాం. చాలా కాలం తర్వాత చెపాక్‌లో ఆడుతున్నాం. జట్టులో అనుభవంతో పాటు యువకులూ ఉన్నారు. చెపాక్‌లో ఆడటం బాగుంటుంది. చిన్న గాయం వల్ల బౌల్ట్ ఆడటం లేదు. కొన్ని మార్పులు చేశాం' అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ CSK: డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, మహీశ్ థీక్షణ, ఎంఎస్ ధోనీ, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ RR : యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జురెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్