IPL 2023 CSK vs RR, Impact Players: 


ఐపీఎల్‌ 2023లో బెస్ట్‌ పవర్‌ ప్లే టీమ్స్‌... చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌! ఈ రెండు జట్లు బుధవారం చెపాక్‌ వేదికగా తలపడుతున్నాయి. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంప్టాక్‌ ప్లేయర్‌ స్ట్రాటజీలు ఏంటి? పిచ్‌ ఎలా ఉండబోతోంది?


చెన్నై సూపర్‌ కింగ్స్‌


తొలుత బ్యాటింగ్‌ చేస్తే : డేవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌, అజింక్య రహానె/ మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, డ్వైన్‌ ప్రిటోరియస్‌, ఎంఎస్‌ ధోనీ, మిచెల్‌ శాంట్నర్‌, మహీశ్‌ థీక్షణ / సిమర్‌జీత్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండే


తొలుత బౌలింగ్‌ చేస్తే : డేవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌, అజింక్య రహానె/ మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, డ్వైన్‌ ప్రిటోరియస్‌, ఎంఎస్‌ ధోనీ, మిచెల్‌ శాంట్నర్‌, మహీశ్‌ థీక్షణ / సిసింద మగల, సిమర్‌జీత్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండే


వాంఖడేలో అజింక్య రహానె వీర విజృంభణం చూశాక అతడిని తొలగించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే మొదట బ్యాటింగ్‌ చేస్తే ముగ్గురు విదేశీ ఆటగాళ్లనే తీసుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్‌ చేసేటప్పుడు అంబటి రాయుడి ప్లేస్‌లో థీక్షణ, మగలను తీసుకోవచ్చు. మొదట బౌలింగ్‌ చేస్తే ఇద్దరు బౌలర్లకీ చోటిస్తారు. ఆ తర్వాత అంబటి రాయుడు లేదా అజింక్యను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎంచుకుంటారు.






రాజస్థాన్‌ రాయల్స్‌


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జురెల్‌, జేసన్ హోల్డర్‌, రవిచంద్రన్ అశ్విన్‌, మురుగన్ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, జేసన్ హోల్డర్‌, రవిచంద్రన్ అశ్విన్‌, మురుగన్ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్ శర్మ / కేఎం ఆసిఫ్‌


సంజూ సేన స్ట్రాటజీ చాలా సింపుల్‌గా ఉంది. ఇండియన్‌ సీమర్‌ లేదా ధ్రువ్‌ జోరెల్‌ ఇంప్టాక్‌ ప్లేయర్లుగా ఉంటారు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే జోరెల్‌ నేరుగా జట్టులో ఉంటాడు. బౌలింగ్‌ చేసేటప్పుడు అతడి స్థానంలో సందీప్‌ శర్మ లేదా కేఎం ఆసిఫ్‌లో ఒకరు వస్తారు. టాస్‌ మారితే ఈ స్ట్రాటజీ రివర్స్‌ అవుతుంది.


స్పిన్నర్లకే అనుకూలం


సహజంగా చెపాక్‌ మందకొడిగా ఉంటుంది. ఈ సీజన్లో మాత్రం హై స్కోరింగ్‌ రేట్‌ కనిపిస్తోంది. పగలు ఉక్కపోత, రాత్రి చల్లగా ఉంటుంది. వికెట్‌ మందకొడిగా ఉంటుంది. ఎక్కువ టర్న్‌ అవుతుంది. హ్యుమిడిటీ వల్ల వర్షం రావడానికి 10 శాతం ఛాన్సుంది. ఒకవైపు బౌండరీ సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి.