RCB vs LSG, IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో నేడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌ తలపడుతున్నాయి. హోమ్‌ గ్రౌండ్‌లో రెండో విజయం కోసం ఆర్సీబీ తహతహలాడుతోంది. మరి నేటి మ్యాచులో తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంపాక్ట్‌ ప్లేయర్‌ స్ట్రాటజీ ఏంటి?


లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్ట్రాటజీ


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌, క్వింటన్‌ డికాక్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య, నికోలస్‌ పూరన్‌, ఆయుష్ బదోనీ, రొమారియో షెపర్డ్‌/మార్క్‌వుడ్‌, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌


తొలుత బౌలింగ్‌ చేస్తే: కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌, క్వింటన్‌ డికాక్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య, నికోలస్‌ పూరన్‌, అమిత్‌ మిశ్రా, రొమారియో షెపర్డ్‌/మార్క్‌వుడ్‌, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌


లక్నో సూపర్‌ జెయింట్స్ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ స్ట్రాటజీ వెరీవెరీ సింపుల్‌! తొలుత బ్యాటింగ్‌ చేస్తే ప్లేయింగ్‌ లెవన్‌లోకి ఆయుష్ బదోనీ వస్తాడు. తొలుత బౌలింగ్‌ చేస్తే అదనపు బౌలర్‌గా కృష్ణప్ప గౌతమ్‌ లేదా అమిత్‌ మిశ్రా వస్తారు. పేస్‌ పిచ్‌ అయితే పేసర్లను తీసుకుంటారు. ఛేదనలో వారిని ఆయుష్ బదోనీ రిప్లేస్‌ చేస్తాడు. ఇప్పటికైతే ఎల్‌ఎస్‌జీ ఫార్మాట్‌ ఇదే.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్ట్రాటజీ


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్ కార్తీక్‌, వనిందు హసరంగ / మైకేల్ బ్రాస్‌వెల్‌, డేవిడ్‌ విలే, హర్షల్‌ పటేల్‌, కర్ణ్ శర్మ, ఆకాశ్‌ దీప్‌


తొలుత బౌలింగ్‌ చేస్తే: విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్ కార్తీక్‌, వనిందు హసరంగ / మైకేల్ బ్రాస్‌వెల్‌, డేవిడ్‌ విలే, హర్షల్‌ పటేల్‌, కర్ణ్ శర్మ, ఆకాశ్‌ దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌


ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటి వరకు తొలుత బ్యాటింగ్‌ చేయలేదు. బౌలింగ్‌ చేస్తోంది కాబట్టి మహ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులో ఉంటున్నాడు. ఒకవేళ మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ప్రభుదేశాయ్‌ తుది జట్టులో ఉంటాడు. ఛేదనలో సిరాజ్‌ అతడిని ఇంప్టాక్‌ ప్లేయర్‌గా రిప్లేస్‌ చేస్తాడు.