RCB vs CSK, IPl 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు అమేజింగ్ రైవల్రీ చూడబోతున్నాం! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. సిక్సర్ల కంచుకోట చిన్నస్వామి మైదానం ఇందుకు వేదిక. మరి ఈ రెండు జట్లలో ఎవరిపై ఎవరిది పై చేయి? రీసెంట్ ఫామ్ ఎలా ఉంంది? పిచ్ రిపోర్టు ఏంటి?
సీఎస్కే కంప్లీట్ డామినేషన్
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ.. బయట థిక్కు ఫ్రెండ్స్! ఐపీఎల్‌లో మాత్రం కత్తులు నూరుకుంటారు! అందుకే ఆర్సీబీ, సీఎస్కే మ్యాచులకు అభిమానులు పోటెత్తుతుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగు చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్‌దే కంప్లీట్ డామినేషన్. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 30 సార్లు తలపడగా ఆర్సీబీ కేవలం 10 గెలిచింది. 19 ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. బెంగళూరు విజయాల శాతం 34.48 మాత్రమే.
రీసెంటు ఫామ్ అంతంతే!
చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రీసెంట్ ఫామ్ అంత బాగాలేదు. చివరి ఐదు మ్యాచుల్లో ఏకంగా నాలుగు సార్లు ఓటమి చవిచూసింది. 2022లో మాత్రమే ఒక మ్యాచ్ గెలిచింది. అంతకు ముందు వరుసగా నాలుగింట్లో పరాజయం చవిచూసింది. 2020 అక్టోబర్లో 8 వికెట్లు, 2021 ఏప్రిల్‌లో 69 పరుగులు, 2021 సెప్టెంబర్ 6 వికెట్లు, 2022 ఏప్రిల్‌లో 23 పరుగుల తేడాతో ధోనీ సేన గెలిచింది. 2022 మేలో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది.
చిన్న గ్రౌండ్.. ఛేదన బెస్ట్!
చిన్నస్వామి అంటే గుర్తొచ్చేది పరుగుల వరదే! పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. బౌండరీలు చాలా చిన్నవి. డ్యూ ఉన్నప్పుడు ఫ్లడ్ లైట్ల కింద బంతి స్కిడ్ అవుతుంది. ఈ సీజన్లో అత్యధికం సిక్సర్లు నమోదైంది ఇక్కడే. కేవలం మూడు మ్యాచుల్లోనే 57 సిక్సర్లు బాదేశారు. చిన్నస్వామిలో ఇప్పటి వరకు 84 మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసినవి 34, ఛేదన చేసినవి 46 సార్లు గెలిచాయి. టాస్ గెలిచిన మ్యాచుల్లో 54.76 విజయాల శాతం ఉంది. మిస్టరీ స్పిన్నర్లు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
కోహ్లీ జోష్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఈ సీజన్లో ఫ్యాన్స్‌ను మురిపిస్తోంది. 4 మ్యాచులాడి 2 గెలిచి 2 ఓడింది. మూడో విజయం అందుకోవాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. పవర్ ప్లేలో అపోజిషన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక కింగ్ కోహ్లీ ఆట అమేజింగ్! 4 మ్యాచుల్లోనే 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సిచ్యువేషన్‌కు తగ్గట్టు ఆడుతున్నాడు. అయితే ఆర్సీబీ బ్యాటింగ్‌లో టాప్ కంట్రీబ్యూటర్లు వీరే కావడం ఒక రకంగా గుడ్ సైన్. మరో రకంగా బ్యాడ్ సైన్. వీరిద్దరూ విఫలమైతే.. మిడిలార్డర్లో మాక్స్‌వెల్ (Maxwell) పైనే భారం పడుతోంది. అతడు గనక విఫలమైతే ఆడేవాళ్లే కనిపించడం లేదు. దినేశ్ కార్తీక్ తన మెరుపులు ప్రదర్శించలేదు. ఆర్సీబీ పవర్ ప్లే బౌలింగ్ బాగుంది. మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) కట్టుదిట్టమైన బంతులేస్తూ వికెట్లు తీస్తున్నాడు. కన్‌సిస్టెంట్‌గా ఒకే లెంగ్తులో బంతులేస్తున్నాడు. హర్షల్ పటేల్ ఇంకా మెరుగవ్వాలి. కరణ్ శర్మ స్పిన్ ఫర్వాలేదు. డెత్ ఓవర్లలో ఆర్సీబీ బలహీనంగా ఉంది.