RCB vs CSK Preview: 


ఇండియన్ ప్రీమియర్‌ లీగులో సోమవారం అమేజింగ్‌ కాంటెస్ట్‌ జరగబోతోంది. 24వ మ్యాచులో చిరకాల ప్రత్యర్థులు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (RCB vs CSK) తలపడుతున్నాయి. చిన్నస్వామి ఇందుకు వేదిక. మరి ఈ మ్యాచులో గెలిచేదెవరు? ఎవరి సిచ్యువేషన్‌ ఏంటి?


కోహ్లీ జోష్‌!


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ఈ సీజన్లో ఫ్యాన్స్‌ను మురిపిస్తోంది. 4 మ్యాచులాడి 2 గెలిచి 2 ఓడింది. మూడో విజయం అందుకోవాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్‌ ఫాప్ డుప్లెసిస్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. పవర్‌ ప్లేలో అపోజిషన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక కింగ్‌ కోహ్లీ ఆట అమేజింగ్‌! 4 మ్యాచుల్లోనే 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సిచ్యువేషన్‌కు తగ్గట్టు ఆడుతున్నాడు. అయితే ఆర్సీబీ బ్యాటింగ్‌లో టాప్‌ కంట్రీబ్యూటర్లు వీరే కావడం ఒక రకంగా గుడ్‌ సైన్‌. మరో రకంగా బ్యాడ్‌ సైన్‌. వీరిద్దరూ విఫలమైతే.. మిడిలార్డర్లో మాక్స్‌వెల్‌ (Maxwell) పైనే భారం పడుతోంది. అతడు గనక విఫలమైతే ఆడేవాళ్లే కనిపించడం లేదు. దినేశ్‌ కార్తీక్‌ తన మెరుపులు ప్రదర్శించలేదు. ఆర్సీబీ పవర్‌ ప్లే బౌలింగ్‌ బాగుంది. మహ్మద్‌ సిరాజ్‌ (Mohammad Siraj) కట్టుదిట్టమైన బంతులేస్తూ వికెట్లు తీస్తున్నాడు. కన్‌సిస్టెంట్‌గా ఒకే లెంగ్తులో బంతులేస్తున్నాడు. హర్షల్‌ పటేల్‌ ఇంకా మెరుగవ్వాలి. కరణ్ శర్మ స్పిన్‌ ఫర్వాలేదు. డెత్‌ ఓవర్లలో ఆర్సీబీ బలహీనంగా ఉంది.


ఓపెనర్లపై భారం!


చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings) సైతం 4 పాయింట్లతోనే ఉంది. ఆరు పాయింట్ల మైలురాయి చేరుకోవాలని ట్రై చేస్తోంది. ఆటగాళ్లు వరుసగా గాయపడటం ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. చెపాక్‌ (Chepauk) తరహా మైదానాల్లో అదరగొడుతోంది. ఇతర స్టేడియాల్లో మాత్రం ఇబ్బంది పడుతోంది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వేనే టాప్‌ స్కోరర్లు. వారు గనక త్వరగా ఔటైతే మిడిలార్డర్లో స్ట్రగుల్‌ అవుతోంది. అజింక్య రహానె (Ajinkya Rahane) స్పీడ్‌గా ఆడుతుండటం గుడ్‌ సైన్‌. అంబటి రాయుడు తన మార్క్‌ చూపించలేదు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) అప్పుడప్పుడూ సిక్సర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను మురిపిస్తున్నాడు. రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ ఫర్వాలేదు. శివమ్‌ దూబె తన పాత్రను పోషిస్తున్నాడు. బౌలింగ్‌లో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. దీపక్‌ చాహర్‌ ఫిట్‌నెస్‌ ఏంటో తెలియదు. దేశ్‌పాండే ఒక్కడే కష్టపడుతున్నాడు. మగల పరిస్థితి తెలియదు. విదేశీ పేసర్లు అనుకున్న మేరకు రాణించడం లేదు. తీక్షణ, శాంట్నర్‌, మొయిన్‌, జడ్డూ స్పిన్‌ బాగుంది.


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ,  రీస్ టాప్లీ.