IPL 2023 Prize Money And Award Details: ఐపీఎల్ 16వ సీజన్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమైన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్వాలిఫైయర్ 1లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ (MI), మే 26వ తేదీన జరిగే రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో ఆడుతుంది. ఈ సీజన్‌లో విజేతతో పాటు రన్నరప్‌కు కూడా కోటి రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ విన్నర్, పర్పుల్ క్యాప్ విన్నర్ ప్లేయర్లకు కూడా అవార్డుతో పాటు లక్ష రూపాయలను అందజేయనున్నారు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ గుజరాత్ టైటాన్స్ జట్టులో భాగమైన శుభ్‌మన్ గిల్ ముంబైతో జరిగే రెండో క్వాలిఫయర్‌లో అతనిని దాటేయవచ్చు. ఫాఫ్ డు ప్లెసిస్ ప్రస్తుతం 730 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 722 పరుగులు చేశాడు.


ఐపీఎల్ విజేత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది?
ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీగా రూ. 20 కోట్లు ఇవ్వనున్నారు.


ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది?
ఈ సీజన్ చివరి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కున్న జట్టుకు ప్రైజ్ మనీగా రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు.


ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాడికి ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది?
ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడికి ప్రైజ్ మనీగా రూ.15 లక్షలు అందజేస్తారు.


పర్పుల్ క్యాప్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది?
ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్న ఆటగాడికి ప్రైజ్ మనీగా రూ.15 లక్షలు ఇస్తారు.


సూపర్ స్ట్రైకర్ అవార్డు గెలుచుకున్న ఆటగాడి ప్రైజ్ మనీ ఎంత?
ఈ సీజన్‌లో సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న బ్యాట్స్‌మన్‌కు ప్రైజ్ మనీగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నారు.


ఎమర్జింగ్ ప్లేయర్ ప్లేయర్‌కు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది?
1995 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఐదు టెస్టుల కంటే తక్కువ, 20 వన్డేలు కూడా ఆడని ఆటగాళ్లు ఈ అవార్డుకు అర్హులు. ఇది కాకుండా ఈ ఆటగాడు ఐపీఎల్‌లో కూడా 25 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ఈ సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడికి ప్రైజ్ మనీగా రూ.20 లక్షలు ఇవ్వనున్నారు.


ఐపీఎల్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. వారు ముంబై ఇండియన్స్ చేతిలో 81 పరుగుల తేడాతో ఓడిపోయారు. ముంబై విజయంలో ఆకాష్ మధ్వాల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో లక్నో పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ప్లేఆఫ్స్‌లో అతి తక్కువ పరుగులు చేసిన మూడో జట్టుగా లక్నో నిలిచింది. 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై డెక్కన్ ఛార్జర్స్ 82 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది ప్లేఆఫ్స్‌లో అత్యంత తక్కువ స్కోరు.


ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో జట్టు 101 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఇది మూడో అత్యల్ప స్కోరు. అంతకుముందు ఐపీఎల్ 2010లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ 82 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ బెంగళూరుతో జరిగింది.