IPL 2023, GT vs MI:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు రెండో క్వాలిఫయర్ జరుగుతోంది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను ముంబయి ఇండియన్స్ ఢీకొట్టబోతోంది! టోర్నీలో మొదటి సారి పాండ్య సేన నాకౌట్ ప్రెజర్ అనుభవిస్తోంది. మరోవైపు హిట్‌మ్యాన్ సేన పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా చెలరేగుతోంది. వీరిద్దరిలో ఫైనల్లో చెన్నైతో తలపడేది ఎవరో చూడాలి!
ప్రెజర్లో జీటీ!
లీగ్ స్టేజ్‌లో అత్యంత ఈజీగా గెలిచిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తొలిసారి ప్రెజర్ ఫీలవుతోంది. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్లో క్లారిటీ కనిపించడం లేదు. క్వాలిఫయర్-1లో చెన్నైతో తలపడ్డప్పుడు ఇదే బయటపడింది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఒక్కడే పోరాడాల్సి వస్తోంది. వృద్ధిమాన్ పరుగులు చేయడం లేదు. 3, 4 ప్లేసుల్లో కాస్త గందరగోళం నెలకొంది. వన్‌డౌన్‌లో రెచ్చిపోతున్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) నాలుగో ప్లేస్‌లో ఇబ్బంది పడుతున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ విజయ్ శంకర్ ఆడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలి. కిల్లర్ మిల్లర్ మెరుపులేం కనిపించడం లేదు. రాహుల్ తెవాతియా ఫెయిల్ అవుతున్నాడు. కొంతలో కొంత రషీద్ ఖాన్ హిట్టింగ్ చేస్తున్నాడు. మహ్మద్ షమి బౌలింగ్‌కు తిరుగులేదు. రషీద్ ఖాన్ స్పెల్‌లో పరుగులొచ్చినా వికెట్లు పడుతున్నాయి. నూర్ అహ్మద్ ఇంకా రాణించాలి. దసున్ శకన ప్లేస్‌లో జోష్ లిటిల్‌కు అవకాశం ఇవ్వొచ్చు. నల్కండే మొన్న గాయపడ్డాడు. దాంతో యశ్ దయాల్‌నే తీసుకోవాల్సిన పరిస్థితి. పాండ్య బౌలింగ్ చేయకపోవడంతో వైవిధ్యం మిస్సవుతోంది.
బెస్ట్ ఛేజింగ్ టీమ్!
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) విధ్వంసకరంగా మారింది. తొలుత బ్యాటింగ్, బౌలింగులో ఫెయిలైన హిట్‌మ్యాన్ సేన ఇప్పుడు రెచ్చిపోతోంది. అసలు ఆ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌ను ఆపగలరా? అన్నంత ధీమాగా ఆడుతున్నారు. ఓపెనర్లు రోహిత్ (Rohit Sharma), కిషన్‌లో ఎవరో ఒకరు దూకుడుగా ఆడుతున్నారు. ఒకవేళ ఇద్దరూ ఔటైనా మిడిలార్డర్ దంచికొడుతోంది. కామెరాన్ గ్రీన్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు నిలిస్తే అంతే సంగతులు. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఎంత డేంజరో తెలిసిందే. తిలక్ వర్మ, నేహాల్ వధేరా అతడి బాటలోనే నడుస్తున్నారు. మధ్యలో టిమ్ డేవిడ్ వంటి భీకరమైన హిట్టర్ ఉన్నాడు. ఈ బ్యాటింగ్ సెటప్‌లో ఏ ముగ్గురు బాగా ఆడినా స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. ఇప్పుడు బౌలింగ్ పరంగానూ మెరుగయ్యారు. చెన్నైలో ఆకాశ్ మధ్వాల్ స్పెల్ రికార్డులు సృష్టించింది. బెరెన్‌డార్ఫ్, పియూష్ చావ్లాకు అతడు జత కలిశాడు. గ్రీన్ ఓ 2 ఓవర్లు వేస్తున్నాడు. క్రిస్ జోర్డాన్ మొన్న ఇబ్బంది పడ్డాడు. అతడు ఫిట్‌గా ఉంటే పేస్ ఆప్షన్స్ పెరుగుతాయి. ఈ సీజన్లో బెస్ట్ ఛేజింగ్ టీమ్ ముంబయి. పైగా గుజరాత్‌పై ఎడ్జ్ ఉంది. అన్నీ కుదిరితే ఫైనల్లో సీఎస్కే వర్సెస్ ముంబయి చూడొచ్చు!
ముంబయి ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.
గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.