PBKS vs GT, IPL 2023: 


ఐపీఎల్‌ 2023లో నేడు పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) ఢీకొంటున్నాయి. విన్నింగ్స్‌ మూమెంటమ్‌ కంటిన్యూ చేయాలని గబ్బర్‌ సేన పట్టుదలగా ఉంది. లోపాలు సరిదిద్దుకోవాలని భావిస్తోంది. కోల్‌కతా చేతిలో అవమానకర ఓటమి నుంచి త్వరగా బయటపడాలని పాండ్య సేన ఉవ్విళ్లూరుతుంది. మరి మొహాలిలో తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంప్టాక్‌ ప్లేయర్స్‌ వ్యూహం ఏంటి?




పంజాబ్‌ కింగ్స్‌ వ్యూహం


తొలుత బ్యాటింగ్ చేస్తే: ప్రభుసిమ్రన్‌ సింగ్‌, శిఖర్ ధావన్‌, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, లియామ్‌ లివింగ్‌స్టన్‌, సామ్‌ కరన్‌, షారుఖ్‌ ఖాన్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, నేథన్‌ ఎలిస్‌, చాహుల్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌


తొలుత ఫీల్డింగ్‌ చేస్తే: శిఖర్ ధావన్‌, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, లియామ్‌ లివింగ్‌స్టన్‌, సామ్‌ కరన్‌, షారుఖ్‌ ఖాన్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, నేథన్‌ ఎలిస్‌, చాహుల్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌, రిషి ధావన్‌


పంజాబ్‌ కింగ్స్‌ చివరి మ్యాచులో ఒక ప్రయోగం చేసింది. సికిందర్‌ రజా లేకుండా రెండో ఇన్నింగ్సులో రబాడను ఇంప్టాక్‌ ప్లేయర్‌గా ఆడించాలని చూసింది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో రజా రావాల్సి వచ్చింది. ఇప్పుడు లివింగ్‌స్టన్ అందుబాటులో ఉన్నాడు కాబట్టి రాబాడకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.




గుజరాత్‌ టైటాన్స్‌ వ్యూహం


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, హార్దిక్‌ పాండ్య, విజయ్ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, అల్జారీ జోసెఫ్‌, మహ్మద్‌ షమి, సాయి కిషోర్‌


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్య, విజయ్ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, అల్జారీ జోసెఫ్‌, మహ్మద్‌ షమి, సాయి కిషోర్‌, జోష్ లిటిల్‌


హార్దిక్‌ పాండ్య అందుబాటులో రావడంతో అభినవ్‌ మనోహర్‌కు తుది జట్టులో చోటుండదు. యశ్ దయాల్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌ ఐదు సిక్సర్లు బాదేశాడు. మరిప్పుడు యశ్‌కు అండగా ఉంటారో లేదో చూడాలి. ఆర్‌.సాయికిషోర్‌ను బరిలోకి దించేందుకు ఇదే సరైన సమయం. జీటీ తొలుత బ్యాటింగ్‌ చేస్తే సాయి సుదర్శన్‌ జట్టులో ఉంటాడు. ఫీల్డింగైతే జోష్ లిటిల్‌ ఉంటాడు. పరిస్థితులను బట్టి వీరే ఇంపాక్ట్‌ ప్లేయర్లు అవుతారు.




పిచ్‌ కండిషన్‌


మొహాలి పిచ్‌ పెద్ద మైదానం! బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కేఎల్‌ రాహుల్‌ ఇక్కడ పరుగుల వరద పారించాడు. డ్యూ ఫ్యాక్టర్‌ తక్కువే ఉంటుంది. కఠినమైన లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులేస్తే బౌలర్లు వికెట్లు తీయొచ్చు. బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటర్‌ ఫ్రెండ్లీ అనొచ్చు.