PBKS vs GT Preview:
ఇండియన్ ప్రీమియర్ లీగులో గురువారం 18వ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ (Punjab Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడుతున్నాయి. మొహాలి ఇందుకు వేదిక. రెండు జట్లూ చెరో 2 విజయాలతో ఉన్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు 6 పాయింట్లతో ముందుకెళ్తుంది. మరి గబ్బర్, కుంగ్ ఫూ పాండ్య జట్ల పరిస్థితి ఏంటి?
పాండ్య అవైలబుల్!
చివరి సీజన్లో మాదిరిగానే గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతోంది. ఛేజింగ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అయితే కేకేఆర్, రింకూసింగ్ చేతిలో మొన్నటి భంగపాటు నుంచి త్వరగా బయటపడాలి. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచుకు అందుబాటులో ఉంటాడు. జట్టులో పెద్దగా మార్పులేమీ అవసరం లేదు. శుభ్ మన్ గిల్, వృద్ధిమాన్ సాహా ఓపెనింగ్స్ బాగుంటున్నాయి. మిడిలార్డర్లో జీటీ ఫర్మిండబుల్‌గా ఉంది. సాయి సుదర్శన్, హార్దిక్, రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నారు. చెన్నై కుర్రాడు విజయ్ శంకర్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడటం పాజిటివ్ పాయింట్. బౌలింగ్ పరంగా ఇబ్బందులేం లేవు. అయితే గబ్బర్‌పై షమి, లివింగ్‌స్టోన్‌పై రషీద్‌కు మంచి రికార్డు లేదు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ బాగుంది.
జీటీ బౌలింగ్‌పై ఆధిపత్యం!
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో సూపర్ డూపర్ మూమెంటమ్‌లో ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. వరుసగా నిలకడగా ఆడుతున్నాడు. భారీ స్కోర్లు చేస్తున్నాడు. చిచ్చర పిడుగు లియామ్ లివింగ్‌స్టోన్ రాకతో కింగ్స్ బ్యాటింగ్ డెప్త్ మరింత పెరుగుతుంది. ఎలాంటి బౌలర్‌నైనా అతడు బెంబేలెత్తించగలడు. రాజపక్స, షారుఖ్, కరణ్, హర్‌ప్రీత్‌లో మిడిలార్డర్ బాగుంది. అయితే నిలకడగా రాణించడం అవసరం. బౌలింగ్‌లోనూ పంజాబ్‌కు మెరుగైన వనరులే ఉన్నాయి. అర్షదీప్, నేథన్ ఎల్లిస్, రిషి ధావన్, సామ్ కరణ్ పేస్ బౌలింగ్ చూస్తున్నారు. ఎల్లిస్ బదులు ఈసారి రబాడను తీసుకొనే ఛాన్స్ ఉంది. హర్‌ప్రీత్, రాహుల్ చాహర్ స్పిన్ వేస్తున్నారు. లివింగ్‌స్టోన్ రాకతో అదనపు స్పిన్నర్ ఆప్షన్ దొరుకుతుంది. గబ్బర్ సేనకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజీ ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కేవరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.
గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.