PBKS vs MI, IPL 2023:
పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది! మొహాలిలో సిక్సర్ల వర్షం కురిపించింది! ముంబయి ఇండియన్స్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది. 20 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. వచ్చిన ప్రతి బ్యాటర్ దూకుడుగానే ఆడాడు. లియామ్ లివింగ్ స్టోన్ (82; 42 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోయాడు. సిక్సర్ల మోత మోగించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (49; 27 బంతుల్లో 5x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. పియూష్ చావ్లాకు 2 వికెట్లు దక్కాయి.
అగ్రెసివ్ బ్యాటింగ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 వద్దే ప్రభుసిమ్రన్ సింగ్ (9)ను అర్షద్ ఖాన్ ఔట్ చేశాడు. మాథ్యూ షార్ట్ (27), శిఖర్ ధావన్ (30) ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 50/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని.. ధావన్‌ను ఔట్ చేయడం ద్వారా పియూష్ చావ్లా విడదీశాడు. ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేశాడు. అప్పటికి స్కోరు 62. ఈ సిచ్యువేషన్లో బరిలోకి దిగిన లియామ్ లివింగ్‌స్టోన్ మొదట్నుంచీ అగ్రెసివ్ ఇంటెంట్‌తో కనిపించాడు. షార్ట్‌తో కలిసి 25 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 12వ ఓవర్లో షార్ట్‌ను చావ్లానే పెవిలియన్‌కు పంపించాడు.
జితక్కొట్టుడు!
వికెట్లు పడ్డప్పటికీ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ 15.2 ఓవర్లకే 150కి చేరుకుంది. అప్పట్నుంచి ఊచకోత మరింత మొదలైంది. రావడం రావడంతోనే జితేశ్ శర్మ ముంబయి బౌలర్లను ఉతికారేశాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు కొట్టాడు. 18.5 ఓవర్లకే స్కోరును 200 దాటించాడు. మరోవైపు లివింగ్‌స్టోన్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత భీకరమైన షాట్లు ఆడేశాడు. వీరిద్దరూ 53 బంతుల్లోనే 119 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించడంతో పంజాబ్ 214/3కు చేరుకుంది.
పంజాబ్ కింగ్స్: ప్రభుసిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహల్ వదేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మద్వాల్, అర్షద్ ఖాన్