MI vs KKR Preview, IPl 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఆదివారం డబుల్‌ హెడర్‌ మ్యాచులు సందడి చేయబోతున్నాయి. తొలి మ్యాచులో ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (MI vs KKR) తలపడుతున్నాయి. వాంఖడే ఇందుకు వేదిక. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. ఈ విజయం రెండు జట్లకూ కీలకం!


ముంబయి.. నో క్రేజ్‌!


వరుసగా మూడు సీజన్ల నుంచి ముంబయి ఇండియన్స్‌కు (Mumbai Indians) కష్టాలు తప్పడం లేదు. కీలక ఆటగాళ్లంతా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన వాళ్లు ఫామ్‌లో లేరు. తమ స్థాయికి తగ్గట్టు ఆడటమే లేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) రీసెంట్‌గా ఫామ్‌లోకి రావడం గుడ్‌ సైన్‌! తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ (Tilak Verma) ముంబయి మిడిలార్డలో అత్యంత ఇంపార్టెంట్‌ ప్లేయర్‌గా మారిపోయాడు. సూర్యకుమార్ యాదవ్‌ తన డకౌట్ల నుంచి ఎప్పుడు బయటపడతాడో తెలియడం లేదు. కామెరాన్‌ గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌ ఆడిందేమీ లేదు. బ్యాటింగ్‌లో డెప్త్‌ కనిపించడమే లేదు. బౌలింగ్‌ డిపార్టుమెంటులోనూ ఇదే సిచ్యువేషన్‌. మెయిన్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఎల్బో గాయంతో రిజర్వు బెంచీకే పరిమితం అయ్యాడు. ఈ మ్యాచులో ఆడతాడో లేదో తెలీదు. మెరిడీత్‌ హృతిక్‌ షోకీన్‌ పర్లేదు. ఇలాంటి జట్టుతో ముంబయి గెలవడం అంత ఈజీ కాదు.


ఓడినా... కేకేఆర్‌ డేంజరస్‌!


ముంబయి ఇండియన్స్‌ ఐదు రోజులు బ్రేక్‌ తీసుకొని తాజాగా వస్తోంది. కోల్‌కతా (Kolkata Knight Riders) మాత్రం 48 గంట్లోనే రెండో మ్యాచ్‌ ఆడాల్సి వస్తోంది. వారికి సరైన విశ్రాంతి తీసుకొనే అవకాశం రాలేదు. కష్టాలు వస్తున్నా నిలబడుతున్న తీరు ఆకట్టుకుంటోంది. కేకేఆర్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ బాగాలేదు. కెప్టెన్‌ నితీశ్ రాణా (Nitish Rana) ముందుండి నడిపిస్తున్నాడు. సన్‌రైజర్స్‌ మ్యాచులో అదరగొట్టాడు. ఇక రింకూ సింగ్‌ (Rinku Singh) ఫ్యాన్స్‌ను మైమరపిస్తున్నాడు. జట్టుకు ఇంపార్టెంట్‌ అయిపోయాడు. వెంకటేశ్ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ మెరిపిస్తున్నారు. ఆండ్రీ రసెల్‌ను ఎప్పట్లాగే ఫిట్‌నెస్‌ సమస్యలు చుట్టుముట్టాయి. అతడి ప్లేస్‌లో డేవిడ్‌ వైస్‌ రావొచ్చు. వరుణ్‌ చక్రవర్తి, సునిల్‌ నరైన్‌ తమ మిస్టరీ స్పిన్‌తో ఆకట్టుకుంటున్నారు. ఉమేశ్ యాదవ్‌, లాకీ ఫెర్గూసన్‌, డేవిడ్‌ వైస్‌ పేస్‌ బౌలింగ్‌ వీక్‌గా ఉంది. రన్స్‌ లీక్‌ చేస్తున్నారు. ముంబయిలో జాగ్రత్తగా లేకపోతే కష్టాలు తప్పవు. రోహిత్‌పై నరైన్‌కు మంచి రికార్డుంది. ఐపీఎల్‌లో ఏడు సార్లు ఔట్‌ చేశాడు.


ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.


కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.