MI vs KKR, IPL 2023:
ఐపీఎల్ 2023లో ముంబయి ఇండియన్స్ తొలి విజయం అందుకుంది. చివరి మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికను ఓపెన్ చేసింది. ఇకపై ఇదే జోరు కొనసాగించాలని తపిస్తోంది. ఆదివారం హోమ్‌గ్రౌండ్ వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది. మరి వీరిలో ఎవరిపై ఎవరిది ఆధిపత్యం! పిచ్ ఎలా ఉండబోతోంది! తుది జట్ల మాటేంటి!
ముంబయిదే అప్పర్ హ్యాండ్!
ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్‌కి ఇష్టమైన శత్రువు కోల్‌కతా నైట్‌రైడర్స్. ఎందుకంటే రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడతాయి. హిస్టరికల్‌గా చూస్తే కేకేఆర్‌పై ముంబయిదే అప్పర్ హ్యాండ్! ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా 22-9తో రోహిత్ సేనదే తిరుగులేని ఆధిపత్యం. విజయాల శాతం ఏకంగా 70.96 శాతం. పది మ్యాచులు ఆడిన మరే జట్టుపైనా ఇలాంటి ఆధిపత్యం ముంబయికి లేదు. రీసెంట్ ఫామ్ ప్రకారమైతే కేకేఆర్ బాగుంది. చివరి ఐదు మ్యాచుల్లో ఆఖరి మూడింట్లో విజయ ఢంకా మోగించింది.
పొడి పిచ్.. ఛేదన సులభం!
మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ముంబయి ఇండియన్స్ డ్రై పిచ్‌ను ప్రిపేర్ చేసి ఉంటుంది. సాధారణంగా నైట్ మ్యాచుల్లో డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి పొడిగా ఉండొచ్చు. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కష్టపడితే బౌలర్లూ పైచేయి సాధించగలరు. ఇక్కడ ఛేదన సులభం. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు 103 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 48, ఛేదన చేసిన జట్టు 55 సార్లు గెలిచాయి. టాస్ గెలిచిన వారికి ఎక్కువ అడ్వాంటేజ్ లభిస్తుంది.
ముంబయి ఇండియన్స్ ప్లేయింగ్ XI (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, నెహాల్ వాదెరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పియూష్ చావ్లా, రిలే మెరిడీత్, జేసన్ బెరెన్‌డార్ప్
ఇంపాక్ట్ ప్లేయర్స్: తొలుత బ్యాటింగ్, బౌలింగ్ చేయడాన్ని బట్టి టిమ్ డేవిడ్, జేసన్ బెరెన్ డార్ఫ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించుకోవచ్చు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయింగ్ XI (అంచనా)
రెహ్మనుల్లా గుర్బాజ్, జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రసెల్ / డేవిడ్ వైస్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునిల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ వర్మ
ఇంపాక్ట్ ప్లేయర్స్: పరిస్థితులను బట్టి సుయాశ్ వర్మ, వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకుంటుంది.