KKR vs RR, IPL 2023: 


ఈడెన్‌ గార్డెన్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (KKR vs RR) ఢీకొంటున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన వాళ్లే నాకౌట్‌ రేసులో ముందుంటారు. మరి వీరిద్దరిలో ఎవరిపై ఎవరిది పైచేయి! రీసెంట్‌ ఫామ్‌ ఎలా ఉంది? పిచ్‌ రిపోర్టు ఏంటి? మీకోసం..!


అప్పర్‌ హ్యాండ్ కేకేఆర్‌దే!


ఐపీఎల్‌ 2023 సీజన్లో రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చెరో పది పాయింట్లతో నిలిచాయి. అందుకే వీరిద్దరికీ ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. చరిత్రను చూస్తే రాయల్స్, నైట్‌రైడర్స్‌ నువ్వా నేనా అన్నట్టే తలపడ్డాయి. ఇప్పటి వరకు 27 మ్యాచుల్లో ఢీకొన్నాయి. అయితే 14-10తో కేకేఆర్‌దే పైచేయి. రెండు మ్యాచుల్లో ఫలితం రాలేదు. రీసెంట్‌ ఫామ్‌ సైతం కేకేఆర్‌కే అనుకూలంగా ఉంది. చివరి ఐదు మ్యాచుల్లో 3-2తో ఆధిపత్యం చెలాయిస్తోంది. 2020లో కేకేఆర్‌ 60 రన్స్‌ తేడాతో గెలిచింది. 2021లో తొలి మ్యాచులో రాయల్స్‌ 7 వికెట్లతో అదరగొట్టింది. కాగా రెండో మ్యాచులో కోల్‌కతా 86 రన్స్‌తో విజయ దుందుభి మోగించింది. ఇక 2022లోనూ చెరో మ్యాచ్ గెలిచాయి. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.


రాయల్స్‌ ఫామ్‌ డిప్‌!


ఈ సీజన్లో రాజస్థాన్‌ 11 మ్యాచులు ఆడింది. తొలి ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచ్‌ ఓడింది. మిగిలిన నాలుగింట్లో అదరగొట్టింది. ఆ ఓడిపోయిన మ్యాచులోనూ ఆఖరి వరకు పోరాడింది. చివరి ఆరు మ్యాచుల్లో సంజూ సేన ఒక్కటే గెలిచింది. మిగిలిన ఐదు ఓడింది. ఇక చివరి మూడు మ్యాచుల్లోనూ ఓడి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫామ్‌ విచిత్రంగా ఉంది. తొలి మ్యాచ్‌ ఓడి తర్వాతి రెండింట్లో గెలిచింది. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓడింది. అయితే చివరి నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి ఒకటి మాత్రమే ఓడింది.


బ్యాటింగ్‌ స్వర్గధామం!


కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ బ్యాటింగ్‌కు స్వర్గ ధామం. ఈ సీజన్లో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ సగటు స్కోరే 205గా ఉంది. ఫాస్ట్‌ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లే ప్రభావం చూపిస్తున్నారు. 8.49 ఎకానమీతో 31 వికెట్లు తీశారు. పేసర్లు 10.47 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టారు. ఈడెన్‌లో ఇప్పటి వరకు 84 మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 34, ఛేదన జట్లు 50 గెలిచాయి. టాస్‌ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ రావడంతో బ్యాటింగ్‌ ఈజీగా ఉంటుంది.


కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.


రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.