KKR vs RR Preview: గాడి తప్పిన సంజూ సేన! కేకేఆర్‌ను ఓడిస్తేనే ప్లేఆఫ్‌ ఛాన్స్‌!

KKR vs RR Preview: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో మరో ఇంపార్టెంట్‌ మ్యాచ్‌కు వేళైంది! కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (KKR vs RR) చావో రేవో తేల్చుకోబోతున్నాయి.

Continues below advertisement

KKR vs RR Preview: 

Continues below advertisement

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో మరో ఇంపార్టెంట్‌ మ్యాచ్‌కు వేళైంది! కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (KKR vs RR) చావో రేవో తేల్చుకోబోతున్నాయి. ఈ పోరులో గెలిచినోళ్లకు ప్లేఆఫ్ అవకాశాలు మరింత సులువు అవుతాయి. మరి నేటి మ్యాచులో ఎవరి పరిస్థితి ఏంటి?

గాడి తప్పిన రాయల్స్‌!

ఈ సీజన్లో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) 11 మ్యాచులు ఆడి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తొలి ఐదు మ్యాచుల్లో విజయ దుందుభి మోగించిన సంజూ సేన ఆ తర్వాత గాడి తప్పింది. చివరి ఆరు మ్యాచుల్లో ఐదు ఓడిపోయింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, కొన్ని వ్యూహాల్లో లాజిక్‌ మిస్సవ్వడం ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికైనా మారకుంటే ఇక ప్లేఆఫ్ సంగతి మర్చిపోవాల్సిందే. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌ ఎప్పట్లాగే అదరగొడుతున్నాడు. జోస్‌ బట్లర్ గతి తప్పాడు. సంజూ శాంసన్ ఫర్వాలేదు. జోరూట్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటే మంచిది! ఫినిషర్‌గా ఊపు ఊపిన హెట్‌మైయర్‌ నుంచి మెరుపులు రావడం లేదు. స్పిన్నర్ల పరంగా ఇబ్బందేమీ లేదు. యూజీ, అశ్విన్‌ వికెట్లు తీస్తున్నారు. హోల్డర్‌ను సామర్థ్యం మేరకు వాడుకోవడం లేదు. సందీప్‌ శర్మ సన్‌రైజర్స్‌పై నోబాల్‌ వేయడం కొంప ముంచింది. చిన్న గాయంతో గత మ్యాచుకు దూరమైన ట్రెంట్‌ బౌల్ట్‌ నేడు అందుబాటులో ఉంటాడు.

సెకండాఫ్‌లో కేకేఆర్ జోరు

మొదట్లో ఓటములతో తల్లడిల్లిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) సెకండాఫ్‌లో వరుస విజయాలతో చెలరేగుతోంది. జట్టు కూర్పు బాగా కుదిరింది. జేసన్‌ రాయ్‌ రాకతో బ్లాస్టింగ్‌ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. మిగిలిన ఆటగాళ్లూ ఫామ్‌లోకి వచ్చారు. కెప్టెన్ నితీశ్‌ రాణా స్పిన్నర్లను ఊచకోత కోస్తున్నాడు. సరైన సమయంలో షాట్లు కొడుతున్నాడు. మిడిలార్డర్‌ ఇబ్బందులూ తొలిగాయి. వెంకటేశ్‌ అయ్యర్‌ విధ్వంసాలు సృష్టించగలడు. రింకూ సింగ్‌ సీజన్‌ మొదట నుంచీ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌ ఫినిషర్‌గా అవతరించాడు. డేంజర్‌ రసెల్‌ అదరగొడుతున్నాడు. వీరిని అడ్డుకుంటేనే రాజస్థాన్‌ గెలవగలదు. బౌలింగ్‌లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సునిల్‌ నరైన్‌ వికెట్లు తీయడం లేదు. శార్దూల్‌, ఉమేశ్‌, రసెల్‌ పేస్‌ బాధ్యతలు చూస్తున్నారు. సుయాశ్ తనదైన స్పిన్‌తో అలరిస్తున్నాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కేకేఆర్‌కు వెన్నెముకగా మారాడు. ఈడెన్‌ గార్డెన్లో అతడు చాలా డేంజరస్‌ అవుతాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.

Continues below advertisement