Jason Roy IPL 2023: ఐపీఎల్ 2023కు షకీబ్ అల్ హసన్, శ్రేయస్ అయ్యర్‌లు దూరం కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్, వ్యక్తిగత కారణాల వల్ల షకీబ్ అల్ హసన్ ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఇంగ్లండ్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్‌ని ఐపీఎల్ 2023 కోసం జట్టులో చేర్చుకుంది. రాయ్ తన దూకుడైన బ్యాటింగ్‌కు పేరు గాంచాడు. ఇప్పటి వరకు తన టీ20 కెరీర్‌లో మొత్తం ఆరు సెంచరీలు సాధించాడు.


2022 డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో షకీబ్ అల్ హసన్‌ను రూ. 1.5 కోట్ల ధర చెల్లించి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో చేర్చుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల అతను ఈ సంవత్సరం టోర్నమెంట్‌లో భాగం కాలేకపోయాడు. అతనితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాయి. ఇప్పుడు జేసన్ రాయ్ రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో భాగమయ్యాడు.


IPL 2023 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 2.8 కోట్లు చెల్లించి జేసన్ రాయ్‌ను జట్టులోకి తీసుకుంది. జేసన్ రాయ్ బేస్ ధర రూ. 1.5 కోట్లు. దాదాపు రెట్టింపు బేస్ ప్రైస్ చెల్లించి కోల్ కతా అతడిని జట్టులో చేర్చుకుంది. జేసన్ రాయ్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్‌ల్లోనూ ఆడతాడు. అదే సమయంలో వైట్ బాల్ క్రికెట్‌లో అతనికి మంచి రికార్డులు ఉన్నాయి.


టీ20 కెరీర్‌లో మొత్తం ఆరు సెంచరీలు
జేసన్ రాయ్ తన టీ20 కెరీర్‌లో మొత్తం 313 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 307 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన రాయ్ 27.77 సగటు, అద్భుతమైన 141.90 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 8,110 పరుగులు చేశాడు. ఇందులో అతను మొత్తం ఆరు సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని అత్యధిక స్కోరు 145 నాటౌట్‌గా ఉంది.


ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్
ఇంగ్లండ్‌కు చెందిన జాసన్ రాయ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తం ఐదు టెస్టులు, 116 వన్డేలు, 64 టీ20లు ఆడాడు. అతను టెస్టుల్లో 18.70 సగటుతో 187 పరుగులు, వన్డేల్లో 39.91 సగటుతో 4271 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 24.15 సగటు, 137.61 స్ట్రైక్ రేట్‌తో 1522 పరుగులు చేశాడు.


IPL 2023 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ షెడ్యూల్


1 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, PCA స్టేడియం, మొహాలి (ఏడు పరుగులతో పంజాబ్ కింగ్స్ విజయం)


6 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా


9 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్


14 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా


16 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియం, ముంబై


20 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ


23 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా


26 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు


29 ఏప్రిల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్


4 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్


8 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా


11 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా


14 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం, చెన్నై


20 మే 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్‌జెయింట్స్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా