DC vs MI, IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మ్యాచులు రోజురోజుకీ ఆసక్తికరంగా సాగుతున్నాయి. హోమ్‌ అండ్‌ అవే ఫార్మాట్‌ను ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే హోమ్‌ గ్రౌండ్‌ పిచ్‌లు ఒక్కో రకంగా ప్రవర్తిస్తుండటంతో సొంత జట్లే సర్‌ప్రైజ్‌ అవుతున్నాయి. మరి దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ ఆడబోతున్న అరుణ్‌జైట్లీ పిచ్‌ ఎలా ఉందంటే? రెండు జట్లలో ఎవరిది ఆధిపత్యం అంటే?


ఛేజ్‌ చేస్తేనే గెలుపు!


దేశంలోని పురాతన స్టేడియాల్లో అరుణ్‌ జైట్లీ (కోట్లా) ఒకటి. ఇప్పటికే ఈ మైదానంలో కొన్ని వందల మ్యాచులు జరిగాయి. కాలం గడిచే కొద్దీ వికెట్‌ నెమ్మదిస్తోంది. స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. బ్యాటర్లు నిలబడితే పరుగులు చేయగలరు. 2019 నుంచి ఇక్కడ 31 టీ20లు జరగ్గా ఛేదన జట్లే 23 సార్లు గెలిచాయి. ఆరుసార్లే టార్గెట్‌ డిఫెండ్‌ చేసుకోగలిగారు. రెండు సార్లు టై అయింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన చివరి మ్యాచులో పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకూ సహకరించింది. కాబట్టి జైట్లీ పిచ్‌లో ముంబయి, దిల్లీలో ఎవరిది పైచేయో ఇప్పుడే చెప్పలేం!


నువ్వా నేనా!


ఐపీఎల్‌ హిస్టరీ చూసుకుంటే దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్‌దే స్వల్ప ఆధిపత్యం! ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 32 సార్లు తలపడ్డాయి. 17-15తో రోహిత్‌ సేనదే అప్పర్‌ హ్యాండ్. రీసెంట్ ఫామ్‌ చూసుకుంటే దిల్లీ దూకుడు మీదుంది. 2020 నుంచి ఐదు సార్లు తలపడగా మూడుసార్లు దిల్లీ గెలిచింది. ఈ ఐదింట్లోనూ ఛేదన జట్టే గెలిచింది. అదీ ఐదు, పది బంతులు మిగిలుండగానే కావడం విశేషం.


దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయింగ్ లెవన్ (అంచనా): డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా, మనీశ్‌ పాండే, రిలీ రొసొ, రోమన్‌ పావెల్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, అభిషేక్ పోరెల్‌, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నోకియా


ముంబయి ఇండియన్స్‌ స్ట్రాటజీ ప్లేయింగ్ లెవన్ (అంచనా): రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కామెరాన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్ వర్మ, త్రిస్టన్‌ స్టబ్స్‌, టిమ్ డేవిడ్‌, హృతిక్‌ షోకీన్‌, పియూష్ చావ్లా, జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌, సందీప్‌ వారియర్‌


రిషభ్‌ పంత్ లేని దిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాలెన్స్‌ కుదరడం లేదు. మిడిలార్డర్లో ఒక్కరూ నిలబడటం లేదు. మనీవ్‌ పాండే వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిచెల్‌ మార్ష్‌ ఫామ్‌లో లేడు. అక్షర్‌ పటేల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ పోరాడుతున్నారు. రిలీ రొసొ, రొమన్‌ పావెల్‌ నిలబడటం లేదు. ఓపెనింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఒక్కడే శ్రమిస్తున్నాడు. దూకుడుగా ఆడే పృథ్వీ షాను ప్రత్యర్థులు షార్ట్‌ పిచ్‌ బంతుల వ్యూహంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అభిషేక్‌ పోరెల్‌, అమన్ ఖాన్‌ ఇంకా కుర్రాళ్లే! బౌలింగ్‌ వరకు దిల్లీ ఫర్వాలేదు. ఖలీల్‌ అహ్మద్‌ వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. ఆన్రిచ్‌ నోకియా వచ్చాక బౌలింగ్‌ అటాక్ మెరుగైంది. కుల్‌దీప్‌ స్పిన్‌ ఫర్లేదు. ముకేశ్‌ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. మూమెంటమ్ అందుకుంటే వార్నర్‌ సేనకు తిరుగుండదు. ఏదేమైనా ఈ మ్యాచుతో రెండు జట్లలో ఎవరో ఒకరు గెలుపు రుచి చూడబోతున్నారు.