DC vs MI, IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్ లీగులో నేడు మరో జట్టు పాయింట్ల ఖాతా తెరవనుంది. తొలి విజయం అందుకోనుంది. అరుణ్‌ జైట్లీ మైదానం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో ముంబయి ఇండియన్స్‌ తలపడనుంది. మరి వీరి తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంప్టాక్‌ ప్లేయర్‌ స్ట్రాటజీ ఏంటి?


దిల్లీ క్యాపిటల్స్‌ వ్యూహం


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా, మనీశ్‌ పాండే, రిలీ రొసొ, రోమన్‌ పావెల్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, అభిషేక్ పోరెల్‌, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నోకియా


తొలుత బౌలింగ్‌ చేస్తే: డేవిడ్‌ వార్నర్‌, మనీశ్‌ పాండే, రిలీ రొసొ, రోమన్‌ పావెల్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, అభిషేక్ పోరెల్‌, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నోకియా, ముకేశ్‌ కుమార్‌


లెఫ్టార్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఫిట్‌నెస్‌తో లేకుంటే దిల్లీ క్యాపిటల్స్‌ చేతన్‌ సకారియాను జట్టులోకి తీసుకుంటుంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తే ఓపెనర్‌ పృథ్వీ షా ఫైనల్‌ లెవన్లో ఉంటాడు. రెండో ఇన్నింగ్సులో ముకేశ్‌ కుమార్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వస్తాడు. ఒకవేళ తొలుత బౌలింగ్‌ చేస్తే ముకేశ్‌ స్థానంలో పృథ్వీ షా ఇంప్టాక్ ప్లేయర్‌ అవుతాడు.




ముంబయి ఇండియన్స్‌ స్ట్రాటజీ


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కామెరాన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్ వర్మ, త్రిస్టన్‌ స్టబ్స్‌, టిమ్ డేవిడ్‌, హృతిక్‌ షోకీన్‌, పియూష్ చావ్లా, జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌, సందీప్‌ వారియర్‌


తొలుత బౌలింగ్‌ చేస్తే: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కామెరాన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌,  త్రిస్టన్‌ స్టబ్స్‌, టిమ్ డేవిడ్‌, హృతిక్‌ షోకీన్‌, పియూష్ చావ్లా, జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌, సందీప్‌ వారియర్‌, కుమార్‌ కార్తీకేయ


చివరి రెండు మ్యాచుల్లో అర్షద్‌ ఖాన్‌ ఓవర్‌కు 14 పరుగుల చొప్పున ఇచ్చాడు. దాంతో ముంబయి అతడిని తీసుకోకపోవచ్చు. బదులుగా సందీప్‌ వారియర్‌ వస్తాడు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే తిలక్‌ వర్మ నేరుగా జట్టులో ఉంటాడు. తర్వాత అతడిని కుమార్‌ కార్తీకేయ్‌ రిప్లేస్‌ చేస్తాడు. బౌలింగ్‌ చేస్తే ఇది రివర్స్‌ అవుతుంది.