IPL 2023: నిన్న(సోమవారం) ఆర్సీబీ(RCB) మ్యాచ్ ఓడిపోయిందీ అంటే దానికి కారణం.... సీజన్ల తరబడి వాళ్లను వేధిస్తున్న పూర్ డెత్ బౌలింగే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ నిన్నటి మ్యాచ్ లోనే ఇరు జట్ల స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ(Virat Kohlli), కేఎల్ రాహుల్(KL Rahul) చాలా పెద్ద నేరం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కోహ్లీతో పోలిస్తే రాహుల్ నేర తీవ్రత ఎక్కువని కూడా చెప్తున్నారు.
213 పరుగుల భారీ టార్గెట్. పిచ్ ఏమో బ్యాటింగ్ కు స్వర్గధామం. అలాంటి పిచ్ మీద.... అసలు గెలవాలన్న ఇంటెంట్ కూడా లేకుండా రాహుల్ ఆడినట్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. పోనీ పవర్ ప్లేలో వరుస వికెట్లు పడ్డాయి కాబట్టి కాస్త నెమ్మదించాడు అనుకుందాం. ఎప్పుడైతే స్టాయినిస్ వచ్చి బాదడం మొదలుపెట్టాడో అప్పుడు రెండో ఎండ్ నుంచి రాహుల్ కూడా బాదుడు మొదలుపెట్టాలి కదా. అలా జరగలేదు. చాలా ఇబ్బందిపడ్డాడు. చివరకు 20 బాల్స్ లో 18 మాత్రమే చేసి.... 12వ ఓవర్ లో ఔటయ్యాడు.స్ట్రైక్ రేట్ కేవలం 90 మాత్రమే. బాల్ కు ఒక్క పరుగు చొప్పున అయినా చేయలేకపోయాడు.
ఇక మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ. పవర్ ప్లేలో పేసర్స్ బౌలింగ్ లో నిజం చెప్పాలంటే విశ్వరూపం చూపించాడు. రెచ్చిపోయాడు. 24 బాల్స్ లోనే 42 స్కోర్ చేశాడు. కానీ 6 ఓవర్లయ్యాక, స్పిన్నర్లు వచ్చాక.... ఫ్లో మొత్తం పోయింది. చాలా స్లో అయిపోయాడు. ఎంతలా అంటే..... అక్కడ్నుంచి తాను ఆడిన 19 బాల్స్ కు 19 మాత్రమే కొట్టాడు. 20వ బాల్ కు ఔటయ్యాడు. లక్నో స్పిన్నర్లు బానే బౌలింగ్ చేసి ఉండొచ్చు. కానీ అప్పటికి ఇంకా ఒక్క వికెట్ కూడా పడలేదు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. అలాంటప్పుడు ఇంకాస్త ఎడిషనల్ రిస్క్ తీసుకుని, పవర్ ప్లే జోష్ ను ఆ తర్వాత కూడా కంటిన్యూ చేసి ఉండాల్సింది.
కామెంటేటర్ సైమన్ డౌల్ కూడా కోహ్లీ ఆటను ప్రశ్నించాడు. ఫస్ట్ లో ధనాధన్ అంటూ ఆడాడని, ఆ తర్వాత మైల్ స్టోన్ కోసం ఆడినట్టు ఉందని మ్యాచ్ జరుగుతుండగా ఆన్ ఎయిర్ లో సైమన్ అన్నాడు. సో అదన్నమాట.... టీ20ల్లో స్ట్రైక్ రేట్ గురించి, డాట్ బాల్స్ గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది కదా. స్ట్రైక్ రేట్ తక్కువ ఉండటం అంటే..... అదో క్రైం అన్నట్టుగా చాలా మంది వర్ణిస్తుంటారు. ఆ రకంగా కేఎల్ రాహుల్ నేర తీవ్రత చాలా ఎక్కువగా.... కోహ్లీది కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.