CSK, vs LSG, IPL 2023:


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో సోమవారం ఆరో మ్యాచ్ జరుగుతోంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings) తలపడుతున్నాయి. చెపాక్‌ (Chepauk) ఇందుకు వేదిక. మరి ఈ మ్యాచులో రెండు జట్ల ఇంపాక్ట్‌ ప్లేయర్లు ఎవరు? ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారంటే?


ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ చెరో మ్యాచ్‌ ఆడేశాయి. కేఎల్‌ రాహుల్‌ బృందం 50 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడింది. బౌలింగ్‌లో విఫలమవ్వడంతో ఓడింది. లక్నో ఆ మ్యాచులో కృష్ణప్ప గౌతమ్‌ను (Krishnappa Gautam) ఇంప్టాక్‌ ప్లేయర్‌గా ఎంచుకుంది. అందుకు తగ్గట్టే అతడు ఇంప్టాక్‌ చూపించాడు. ధోనీ ఎంచుకున్న తుషార్‌ దేశ్‌పాండే (Tushar Deshpande) ఇంపాక్ట్‌ చూపించలేదు.


సీఎస్‌కేపై లక్నో స్ట్రాటజీ


తొలుత బ్యాటింగ్‌ తీసుకుంటే: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, మార్క్ వుడ్, అమిత్‌ మిశ్రా, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్


తొలుత బౌలింగ్‌ తీసుకుంటే : కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతమ్‌, మార్క్ వుడ్, అమిత్‌ మిశ్రా, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్


ఈ మ్యాచులో లక్నో మళ్లీ కృష్ణప్ప గౌతమ్‌నే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎంచుకొనే ఛాన్సుంది. ఎందుకంటే చెపాక్‌ పిచ్‌ చాలా మందకొడిగా ఉంటుంది. ఎక్కువ టర్న్‌ అవుతుంది. స్పిన్నర్లకు సహకరిస్తుంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తే ఆయుష్ బదోనీ బ్యాటింగ్‌ అవ్వగానే కృష్ణప్పను సబ్‌స్టిట్యూట్‌ చేస్తుంది. ఇక బౌలింగ్‌లో అయితే నేరుగా అతడినే తుది జట్టులోకి తీసుకుంటుంది. అమిత్‌మిశ్రా స్థానంలో ఆయుష్‌ బదోనీని ఇంప్టాక్‌ ప్లేయర్‌గా ఆడిస్తుంది. చివరి మ్యాచులో కృష్ణప్ప గౌతమ్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాదడమే కాకుండా 4 ఓవర్లు వేసి 23 పరుగులే ఇచ్చాడు.


ఎల్‌ఎస్‌జీపై చెన్నై స్ట్రాటజీ


తొలుత బ్యాటింగ్‌ చేస్తే:  డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్


తొలుత బౌలింగ్‌ చేస్తే : డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్,  శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, సమిర్‌జీత్‌ సింగ్‌ / తుషార్‌ దేశ్‌పాండే


చివరి మ్యాచులో అంబటి రాయుడు ప్లేస్‌లో తుషార్‌ దేశ్‌పాండేను చెన్నై ఇంప్టాక్‌ ప్లేయర్‌గా తీసుకుంది. గుజరాత్‌ ఛేదనలో అతడు 3.2 ఓవర్లకే 51 రన్స్‌ ఇచ్చాడు. బహుశా ఈ మ్యాచుకు అతడిని తీసుకొనే విషయంలో ధోనీసేన కాస్త ఆలోచించొచ్చు. కానీ సిసంద మగల, మహీశ్‌ థీక్షణ, పతిరణ మరో రెండు మ్యాచుల వరకు అందుబాటులో ఉండరు. అప్పటి వరకు దేశ్‌ పాండేనే దిక్కవుతాడు. లేదంటే సిమర్‌జీత్‌ను ఉపయోగించుకోవచ్చు. డ్వేన్‌ ప్రిటోరియస్‌కు మాత్రం ఛాన్స్‌ ఉండదు. అతడిని తీసుకోవాలంటే బెన్‌స్టోక్స్‌, శాంట్నర్‌, మొయిన్‌ అలీ, డేవాన్‌ కాన్వేలో ఒకరు త్యాగం చేయాలి. అప్పుడు బ్యాటింగ్‌ డెప్త్‌ తగ్గుతుంది. ఒక్క మ్యాచుకే ఆటగాళ్లను మార్చే అలవాటు ధోనీకి లేదు. కాబట్టి ఈ మ్యాచులో దేశ్‌పాండేనే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనుకోవచ్చు.


పిచ్ రిపోర్ట్


చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు సొంత మైదానం. మరోవైపు ఇక్కడి పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మైదానం పిచ్ చాలా స్లోగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్పిన్నర్లు కీలకం కానున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో స్పిన్నర్లు ఎక్కువగానే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వారి సొంత మైదానంలో వారిని ఓడించడం చాలా కష్టం.