IPL 2022 srh vs rcb preview sunrisers hyderabad vs royal challengers bangalore head to head records :  ఐపీఎల్‌ 2022లో 54వ మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. వాంఖడే (Wankhede Stadium) ఇందుకు వేదిక. తన ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవద్దన్న లక్ష్యంతో ఆర్సీబీ ఉంది. మళ్లీ టాప్‌-4లో చేరిపోవాలని హైదరాబాద్‌ (SRH) పట్టుదలగా ఉంది. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?


సన్‌రైజర్స్‌దే పైచేయి


ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. 11 మ్యాచుల్లో 6 గెలిచి 5 ఓడి 12 పాయింట్లు అందుకుంది. నెగెటివ్‌ రన్‌రేట్‌ ఉండటం కలవరపరిచే అంశం. ఈ మ్యాచులో గెలిస్తే 14 పాయింట్లతో ఇంకా పటిష్ఠంగా మారిపోతారు. మరోవైపు సన్‌రైజర్స్‌ 10 మ్యాచుల్లో 5 గెలిచి 5 ఓడింది. 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ పోరులో గెలిస్తే మళ్లీ టాప్‌-4లో నిలుస్తుంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఒడిసిపడుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 9-11తో ఆర్సీబీ వెనకబడింది.


కీలక ఆటగాళ్ల ఫామ్‌ లేమి


ఆర్సీబీ చూడ్డానికి బాగానే అనిపిస్తున్నా కీలక ఆటగాళ్ల ఫామ్‌లేమి ఇబ్బంది పెడుతోంది. విరాట్‌ కోహ్లీ బంతికో పరుగు చొప్పున చేస్తున్నాడు. మునుపటి ఫామ్‌ అందుకోవాల్సి ఉంది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ బ్యాటింగూ అలాగే మారింది. రజత్‌ పాటిదార్‌, మహిపాల్‌ లోమ్రర్‌, మహ్మద్‌ షాబాజ్‌, దినేశ్‌ కార్తీక్‌ వారిని బతికిస్తున్నారు. మాక్స్‌వెల్‌ ఎప్పట్లాగే ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా ఉన్నాడు. బంతి, బ్యాటుతో రాణిస్తున్నాడు. హర్షల్‌ పటేల్‌, హేజిల్‌వుడ్‌ మంచి లెంగ్తుల్లో బంతులేస్తూ డెత్‌ ఓవర్లలో రాణిస్తున్నారు. సిరాజ్‌ రన్స్‌ లీక్‌ చేస్తున్నాడు. బలహీనతలను సరిదిద్దుకుంటే ఆర్సీబీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.


గాయాల పాలైన క్రికెటర్లు


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జర్నీ విచిత్రంగా సాగుతోంది. మొదట్లో 2 ఓడింది. ఆపై వరుసగా 5 గెలిచి ఔరా! అనిపించింది. మళ్లీ వరుసగా 3 ఓడిపోయి టెన్షన్‌ పడుతోంది. మరోటి ఓడితే ఆ సంఖ్య 4కు చేరుతుంది. ఈ సీజన్లో తలపడ్డ మొదటి మ్యాచులో ఆర్సీబీని ఓ ఆటాడుకోవడం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. ఆటగాళ్ల గాయాలు జట్టును వేధిస్తున్నాయి. వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌ గాయపడ్డారు. ముఖ్యంగా నట్టూ లేని లోటు బాగా తెలుస్తోంది. ఉమ్రాన్‌ మాలిక్‌ మళ్లీ ఎక్కువ రన్స్‌ ఇచ్చేస్తున్నాడు. జన్‌సెన్‌ ఫర్వాలేదు. స్పిన్‌ విభాగంలో కాస్త వీక్‌గానే ఉంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫామ్‌ లేమి థ్రెట్‌గా మారింది. మిడిలార్డర్లో మార్‌క్రమ్, రాహుల్‌ త్రిపాఠిపై ఒత్తిడి ఉంది. అభిషేక్‌, నికోలస్‌ పూరన్ ఫామ్‌లో ఉండటం శుభసూచకం.


SRH vs RCB Probable XI


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, షాబాజ్ అహ్మద్‌, మహిపాల్‌ లోమ్రర్‌, దినేశ్ కార్తీక్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, జోస్ హేజిల్‌వుడ్‌


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేన్‌ విలియమ్సన్‌, అభిషేక్ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ / సేన్‌ అబాట్‌, శ్రేయస్‌ గోపాల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కార్తీక్‌ త్యాగీ, ఉమ్రాన్‌ మాలిక్‌