ఐపీఎల్‌లో నేడు రాత్రి జరగనున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉండగా... ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలనేది ముంబై లక్ష్యం.


రాజస్తాన్ రాయల్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి మంచి జోరు మీదుంది. జోస్ బట్లర్ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా... యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ జోరు చూపిస్తూ టైటిల్ వేటలో దూసుకుపోతుంది.


మరోవైపు ముంబై పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. బ్యాట్స్‌మెన్ ఫాంలో లేకపోవడం, బుమ్రా మినహా ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోతుండటంతో ఈ సీజన్‌లో చాలా ఇబ్బందులు పడుతుంది. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్‌లో వారి ప్రదర్శన ఎలా ఉందో.


ముంబై ఇండియన్స్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ స్థానంలో టిమ్ డేవిడ్, జయదేవ్ ఉనద్కత్ స్థానంలో కుమార్ కార్తికేయ జట్టులోకి వచ్చారు. అయితే రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టులో ఎటువంటి మార్పులూ చేయలేదు.


రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు
జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శామ్సన్ (కెప్టెన్/వికెట్ కీపర్), డేరిల్ మిషెల్, షిమ్రన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్


ముంబై ఇండియన్స్ తుదిజట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షౌకీన్, డేనియల్ శామ్స్, జస్‌‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రైలే మెరెడిత్