ఐపీఎల్‌లో శనివారం రాత్రి జరగనున్న కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా ముంబైకి ఒరిగేదేమీ లేదు. కానీ ఫలితం రెండు జట్ల భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ముంబై గెలిస్తే ఢిల్లీ ఇంటికి, బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరనున్నాయి. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే... బెంగళూరు ఇంటికి వెళ్లనుంది, ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరనుంది.


ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రొవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్


ముంబై ఇండియన్స్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డేనియల్ శామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షౌకీన్, జస్‌ప్రీత్ బుమ్రా, రైలే మెరెడిత్, మయాంక్ మార్కండే