ఐపీఎల్‌లో గురువారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ఎల్‌క్లాసికోగా పిలుచుకుంటారు. చెన్నై, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ముంబై 19 విజయాలు సాధించగా... చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌లు సొంతం చేసుకుంది.
ఈ సీజన్‌లో చెన్నై, ముంబై ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా... ఈ మ్యాచ్ ఓడితే చెన్నై కూడా ఇంటి బాట పట్టనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఇక తుదిజట్ల విషయానికి వస్తే... ముంబై ఆశ్చర్యకరంగా పొలార్డ్‌ని పక్కన పెట్టింది. తన స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి వచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయడు, మొయిన్ అలీ, శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రేవో, మహీష్ థీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముకేష్ చౌదరి
ముంబై ఇండియన్స్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, రమణ్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, జస్‌ప్రీత్ బుమ్రా, రైలే మెరెడిత్