IPL 2022 LSG survive Rinku Singhs onslaught to seal playoff berth twitter reactions : లక్నో సూపర్ జెయింట్స్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రింకూసింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆశలు వదిలేసిన స్థితి నుంచి దాదాపుగా గెలిపించినంత పనిచేసిన అతడిని అంతా పొగిడేస్తున్నారు. ఎల్‌ఎస్‌జీకి అతడు చుక్కలు చూపించాడని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆఖర్లో ఎయిన్ లూయిస్ సింగిల్ హ్యాండ్ క్యాచ్, లక్నో గెలిచిన తీరు థ్రిల్లర్‌ను తలపించడంతో ఆనందిస్తున్నారు. చాన్నాళ్ల ఓ అమేజింగ్ మ్యాచ్ చూశామంటున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా మంచి స్టార్ట్ లభించలేదు. అయినప్పటికీ ఆఖరి వరకు ఆ జట్టు పోరాడిన తీరు అందరి మనసుల్ని తాకింది. నిజానికి 16.4 ఓవర్లకు కోల్‌కతా 150 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. దాంతో ఇక కేకేఆర్ పనైపోయినట్టేనని అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్ట సమయంలో సునిల్ నరైన్ (21*; 7 బంతుల్లో 3x6)sy కలిసి రింకూ సింగ్ (40; 15 బంతుల్లో 2x4, 4x6) విధ్వంసమే సృష్టించాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. కేకేఆర్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 21 పరుగులు అవసరం. ఒత్తిడి చంపేస్తున్న వేళ తొలి మూడు బంతుల్ని రింకూ వరుసగా 6, 4, 6గా మలిచాడు. సమీకరణం 3 బంతుల్లో 5గా మారింది. 4వ బంతికి 2 పరుగులు తీసిన రింకూను ఐదో బంతికి ఎవిన్ లూయిస్ ఓ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ పంపించాడు. ఆఖరి బంతికి ఉమేశ్‌ను స్టాయినిస్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఆఖరి రెండు ఓవర్లు థ్రిల్లర్‌ను తలపించడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చాన్నాళ్ల తర్వాత ఓ థ్రిల్లింగ్ మ్యాచ్ చూశామని అంటున్నారు. రింకూ సింగ్ బ్యాటింగ్, ఎవిన్ లూయిస్ సింగిల్ హ్యాండ్ క్యాచ్, ఆఖరి బంతికి యార్కర్‌తో వికెట్ తీసిన స్టాయినిస్‌ను అభినందిస్తున్నారు.