ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు టాప్-2కి చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో రెండో స్థానంలోనూ, రాజస్తాన్ మూడో స్థానంలోనూ ఉన్నాయి.


ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. ఏప్రిల్ 10వ తేదీన జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కేవలం మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది.


రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్/వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, జిమ్మీ నీషం, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెకాయ్


లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, అయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జేసన్ హోల్డర్, మొహ్‌సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్