ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అర్థ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ (53: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ విజయానికి 120 బంతుల్లో పరుగులు కావాలి. చివరి ఐదు ఓవర్లలో చెన్నై ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి ఆశించిన ఆరంభం లభించలేదు. ఫాంలో ఉన్న ఓపెనర్ డెవాన్ కాన్వే (5: 9 బంతుల్లో) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ (21: 17 బంతుల్లో, రెండు సిక్సర్లు) వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 53 పరుగులు జోడించారు.
అయితే మొయిన్ అలీ అవుటయ్యాక చెన్నై ఇన్నింగ్స్‌లో ఊపు పూర్తిగా పడిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదించడంతో పాటు రాయుడు స్థానంలో వచ్చిన జగదీషన్ (39: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు. ధోని (7: 10 బంతుల్లో), శివం దూబే (0: 2 బంతుల్లో) మరోసారి విఫలం అయ్యారు.
చివరి ఐదు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 24 పరుగులు మాత్రమే చెన్నై సాధించగలిగింది. దీంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా... రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిషోర్‌లకు తలో వికెట్ దక్కింది.