ఐపీఎల్‌లో శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకమే. కోల్‌కతా ఈ మ్యాచ్ ఓడితే నేరుగా ఇంటి బాట పట్టడమే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతే వారు తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవడంతో పాటు మిగిలిన జట్ల ఫలితాలు, నెట్ రన్‌రేట్ సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.


ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిదో స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడో స్థానంలోనూ ఉంది. కోల్‌కతా ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించగా... సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు సాధించింది. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ రైజర్స్ ఓటమి పాలైంది. ప్లేఆఫ్స్ ఆశలు బలపరుచుకోవడానికి ఈ మ్యాచ్ విజయం వారికి తప్పనిసరి. ఇక కోల్‌కతా గత మ్యాచ్‌లో ముంబైపై ఏకంగా 52 పరుగులతో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మలిక్


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు
వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి