KKR unveils NEW jersey on Holi: గతంలో రెండు పర్యాయాలు ఐపీఎల్ ట్రోఫీ సాధించిన మాజీ ఛాంపియన్ కోల్ కోతా నైట్ రైడర్స్ ఈ సీజన్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది. శ్రేయస్ అయ్యర్‌ను పట్టుబట్టి మరీ తీసుకున్న ఆ ఫ్రాంచైజీ నేడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కెప్టెన్ అయ్యర్ చేతుల మీదుగా జెర్సీని లాంచ్ చేసింది.
ఐపీఎల్‌లో ఖరీదైన ఆటగాడిగా..
ఐపీఎల్ 2022 సీజన్‌కు గానూ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తమ జెర్సీని ఆవిష్కరించింది. ఆపై పాత జట్లు సైతం కొత్త జెర్సీ వైపు చూస్తున్నాయి. తాజాగా కేకేఆర్ కొత్త జెర్సీ లాంఛ్ చేసింది. కెప్టెన్ అయ్యర్ చేతుల మీదుగా జెర్సీ (Shreyas Iyer unveils NEW jersey of KKR) ఆవిష్కరించింది. ఐపీఎల్ లో ఖరీదైన ఆటగాళ్లలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒకడు. వేలంలో రూ.12.25 కోట్లతో కేకేఆర్ ఈ టీమిండియా క్రికెటర్‌ను తీసుకుందంటే అతడిపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలుపుతుంది. గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్, ఇయాన్ మెర్గాన్ సారథ్యం వహించినా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. తాజాగా అయ్యర్‌పై ఆ బారాన్ని ఉంచింది కేకేఆర్ యాజమాన్యం.
బ్యాటింగ్‌లో ఎవరున్నారు..
వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితిశ్ రాణా, ఆండ్రీ రస్సెల్, అలెక్స్ హేల్స్, అజింక్య రహానే లాంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయ్యర్‌కు తోడుగా విండీస్ సంచలనం సునీల్ నరైన్ ఓపెనింగ్ చేయగలడు. వేరే స్థానాల్లోనూ దిగి, మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉంది.
బౌలింగ్‌లోనూ అదుర్స్..
శివమ్ మావి, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తిలతో బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. వీరితో పాటు నరైన్, రస్సెల్‌లు అదనపు బలం. తుది జట్టులో శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి ఉంటారు. విదేశీ బౌలర్ల విషయాకొనికొస్తే పాట్ కమిన్స్ గానీ టిమ్ సౌథీలలో ఒకరికి జట్టులో చోటు దక్కుతుంది. గత సీజన్లతో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ ఆల్ రౌండర్లు ఉండటం కేకేఆర్‌కు ప్లస్ పాయింట్.
Also Read: IPL 2022: ఐపీఎల్ ముంగిట DC, CSK, SRH, MIని పరేషాన్ చేస్తున్న ఓ తలనొప్పి!
Also Read: IPL 2022, RCB: ఈ సాలా కెప్టెన్ మారిండు! డుప్లెసిస్‌కు బిగ్ టెస్టు పెట్టిన కోహ్లీ, RCB