IPL 2022, Full Winners List: ఐపీఎల్ 2022లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. తమ మొదటి సీజన్‌లోనే ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఐపీఎల్ 2022 ఎమర్జింగ్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్
IPL 2022 Emerging Player: ఐపీఎల్ 2022లో పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు. జాస్ బట్లర్ (863 పరుగులు) ఆరెంజ్ క్యాప్ అందుకోగా, రాజస్తాన్‌కే చెందిన బౌలర్ యుజువేంద్ర చాహల్ అత్యధికంగా 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ నిలిచాడు. ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ద సీజన్ గా గుజరాత్ టైటాన్స్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ (గంటకు 157.3 కి.మీ వేగం) అవార్డు దక్కించుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్ అవార్డ్ విన్నర్స్ వీరే..
ఆరెంజ్ క్యాప్: జాస్ బట్లర్ (863 పరుగులు)
పర్పుల్ క్యాప్: యుజువేంద్ర చాహల్ (27 వికెట్లు)
ప్లేయర్ ఆఫ్ ద సీజన్: జాస్ బట్లర్ (రాజస్తాన్)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: ఉమ్రాన్ మాలిక్ (సన్ రైజర్స్)
అత్యధిక సిక్సులు: జాస్ బట్లర్ -45 (రాజస్తాన్)
అత్యధిక ఫోర్లు: జాస్ బట్లర్ - 83 (రాజస్తాన్)
ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (రూ. 5 లక్షలు)
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: దినేష్ కార్తీక్ (183.33 స్ట్రైక్ రేట్)
ఫెయిర్‌ప్లే అవార్డ్: రాజస్తాన్ రాయల్స్
పవర్‌ప్లేయర్ ఆఫ్ ద సీజన్: జాస్ బట్లర్
ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ద సీజన్: లాకీ ఫెర్గూసన్ (గంటకు 157.3 కి.మీ వేగం)
క్యాచ్ ఆఫ్ ద సీజన్: ఎవిన్ లూయిస్
ఫైనల్‌లో సూపర్ స్ట్రైకర్: డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్) - రూ. 1 లక్ష
డ్రీమ్11 మ్యాచ్ ఛేంజర్ అవార్డ్ : హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్) - రూ. 1 లక్ష
లెట్స్ క్రాక్ ఇట్ సిక్స్ ఆఫ్ ది మ్యాచ్ : యశస్వి జైస్వాల్ (రాజస్తాన్) - రూ. 1 లక్ష
పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రెంట్ బౌల్ట్ (రాజస్తాన్) - రూ. 1 లక్ష
అప్‌స్టాక్స్ మోస్త్ వాల్యుబుల్ అసెట్: హార్దిక్ పాండ్యా (గుజరాత్) - రూ. 1 లక్ష
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్: లాకీ ఫెర్గూసన్ (గుజరాత్) - రూ. 1 లక్ష
రూపే ఫోర్లు: జాస్ బట్లర్ (రాజస్తాన్) - 5 ఫోర్లు - రూ. 1 లక్ష
Also Read: IPL 2022 Winner: రాయల్స్‌ను రఫ్ఫాడించిన టైటాన్స్ - ఆఖరి అడుగుపై బోల్తా పడిన రాజస్తాన్!