ఐపీఎల్‌ 2022లో బుధవారం రాత్రి జరుగుతున్న 58వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడనున్నాయి. డీవై పాటిల్‌ స్టేడియం (DY Patil Stadium) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. లీగ్‌ దశ చివరికి చేరుతుండటంతో ప్లేఆఫ్స్‌కు చేరడానికి రెండు జట్లకు ఇది కీలక మ్యాచ్‌గా మారింది.


రాజస్తాన్‌దే బెటర్‌ సిట్యుయేషన్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి నాలుగు ఓడిపోయింది. 14 పాయింట్లు సాధించి, 0.326 రన్‌రేట్‌తో ఉంది. మిగతా వారితో పోలిస్తే కొద్దిగా మంచి‌ పొజిషన్‌లోనే ఉంది. మరోవైపు 11 మ్యాచుల్లో ఐదు గెలిచిన ఢిల్లీ 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరో మూడు జట్లు 10 పాయింట్లతోనే ఉన్నా మంచి రన్‌రేట్‌ వారిని పై స్థాయిలో ఉంచింది. రాజస్థాన్‌, ఢిల్లీ రెండూ సమవుజ్జీలే! ఈ రెండు జట్లూ ఇప్పటి వరకు 25 మ్యాచుల్లో తలపడగా 13 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌, 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించాయి.


ప్లేఆఫ్‌ చేరుకొనేందుకు కాస్త మెరుగైన అవకాశాలు ఉండటంతో రాజస్థాన్‌ రాయల్స్‌పై మరీ ఒత్తిడేమీ లేదు! జోస్‌ బట్లర్‌, యశస్వి జైశ్వాల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ వికెట్‌ విలువ తెలుసుకొని ఆడాలి. తను క్రీజులో ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిడిలార్డర్లో రియాన్‌ పరాగ్‌, దేవ్‌దత్ పడిక్కల్‌ ఉన్నారు. హెట్‌మైయిర్‌ తన భార్య ప్రసవించడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో జిమ్మీ నీషమ్‌, డుసెన్‌, మిచెల్‌లో ఒకరికి అవకాశం‌ వస్తుంది. బౌలింగ్‌ పరంగా రాజస్థాన్‌కు తిరుగులేదు. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్‌ బౌల్ట్‌, కుల్దీప్‌ సేన్‌, ప్రసిద్ధ్‌ దుమ్మురేపుతున్నారు.


ఢిల్లీకి కరోనాయే శత్రువు
ఈ సీజన్లో కరోనా వైరస్సే ఢిల్లీని ఓడించింది. చెన్నై మ్యాచుకు ముందూ బృందంలో ఒకరికి కొవిడ్‌ రావడంతో కనీసం టీమ్‌ మీటింగ్‌ కూడా పెట్టుకోలేకపోయారు. పంత్‌ సేన ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాలి. వార్నర్‌, పృథ్వీ షా, కేఎస్‌ భరత్‌, మిషెల్‌ మార్ష్‌, రిషబ్‌ పంత్‌, రొవ్‌మన్‌ పావెల్‌లో కనీసం ఇద్దరు నిలిస్తే భారీ స్కోర్లు వస్తాయి. బౌలింగ్‌ విభాగం మెరుగ్గా వ్యూహాలు రచిస్తే బెటర్‌. శార్దూల్‌, కుల్దీప్‌, ఆన్రిచ్ నోకియా ఫర్వాలేదు. మంచి ఆటగాళ్లు ఉన్నా వ్యూహాల అమల్లో విఫలమవ్వడమే ఢిల్లీ కొంప ముంచుతోంది.


ఢిల్లీ క్యాపిటల్స్‌ తుదిజట్టు
డేవిడ్‌ వార్నర్‌, కేఎస్ భరత్‌, మిచెల్‌ మార్ష్‌, రిషభ్ పంత్‌ (కెప్టెన్, వికెట్ కీపర్), రొవ్‌మన్‌ పావెల్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నోర్జే, చేతన్ సకారియా


రాజస్థాన్‌ రాయల్స్‌ తుదిజట్టు
యశస్వి జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజు శామ్సన్‌ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, రాసీ వాన్ డర్ డుసెన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ సేన్‌