ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరడానికి చెన్నైకి ఇంకా ఒక్క శాతం అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి చెన్నై విజయం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది.


ఈ రెండు జట్లూ ఇంతవరకు 26 సార్లు తలపడగా... చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఢిల్లీకి 10 విజయాలు దక్కాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్, చెన్నై సూపర్ కింగ్స్‌లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే కీలకం కానున్నారు. ముఖ్యంగా ధోని కెప్టెన్సీ తీసుకున్నాక డెవాన్ కాన్వే వేగంగా ఆడుతూ చెలరేగిపోతున్నాడు.


చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రేవో, సిమర్‌జిత్ సింగ్, మహీష్ థీక్షణ, ముకేష్ చౌదరి


ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు
డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, మిషెల్ మార్ష్, రిషబ్ పంత్, రొవ్‌మన్ పావెల్, రిపల్ పటేల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఆన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్