SRH vs RCB Toss Update: ఐపీఎల్ 2022లో 54వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాసులు గెలుస్తున్న కేన్‌పై టాస్ గెలవడం ఆనందంగా ఉందని అతడు పేర్కొన్నాడు. సిరాజ్ నెట్స్‌లో కష్టపడుతున్నాడని త్వరలోనే మంచి ప్రదర్శన వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. చివరి మ్యాచులో గెలవడం ఆత్మవిశ్వాసం అందించిందని తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించాడు.
టార్గెట్లను తాము విజయవంతంగా ఛేదిస్తున్నామని సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. బంతితోనూ రాణించడం ముఖ్యమని పేర్కొన్నాడు. అబాట్, గోపాల్‌కు చోటు దక్కలేదని చెప్పాడు. వారి స్థానాల్లో ఫారూఖి, సుచిత్ వస్తున్నారని తెలిపాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోస్ హేజిల్‌వుడ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, సుచిత్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫారూఖీ
సన్‌రైజర్స్‌దే పైచేయి
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. 11 మ్యాచుల్లో 6 గెలిచి 5 ఓడి 12 పాయింట్లు అందుకుంది. నెగెటివ్ రన్‌రేట్ ఉండటం కలవరపరిచే అంశం. ఈ మ్యాచులో గెలిస్తే 14 పాయింట్లతో ఇంకా పటిష్ఠంగా మారిపోతారు. మరోవైపు సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో 5 గెలిచి 5 ఓడింది. 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ పోరులో గెలిస్తే మళ్లీ టాప్-4లో నిలుస్తుంది. ప్లేఆఫ్స్ అవకాశాలను ఒడిసిపడుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 9-11తో ఆర్సీబీ వెనకబడింది.
<