SRH vs RCB, 1 innings highlights: ఐపీఎల్ 2022లో 54వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆకట్టుకుంది. ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 193 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. బ్యాడ్ ఓపెనింగ్ వచ్చినా డుప్లెసిస్ (73*; 50 బంతుల్లో 8x4, 2x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రజత్ పాటిదార్ (48; 38 బంతుల్లో 4x4, 2x6) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ మాక్స్‌వెల్ (33; 24 బంతుల్లో 3x4, 2x6), దినేశ్ కార్తీక్ (30*; 0 బంతుల్లో 1x4, 4x6) మెరుపు షాట్లతో అలరించాడు. జగదీశ్ సుచిత్ 2 వికెట్లు పడగొట్టాడు.
డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్
మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్న ఓపెనింగ్ మాత్రం వారికి దక్కలేదు. జగదీషా సుచిత్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతడు తడబడుతున్న సంగతి తెలిసిందే. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ చేజార్చుకోవడంతో ఆర్సీబీ వెనబడుతుందేమో అనిపించింది! కానీ డుప్లెసిస్, రజత్ పాటిదార్ మెరుపు షాట్లు ఆడుతూ దుమ్మురేపారు. 6.5 ఓవర్లకే 50 పరుగులు చేసేశారు. డుప్లెసిస్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 105 రన్స్ పార్ట్‌నర్‌షిప్ సాధించారు. 12.2వ బంతిని భారీ షాట్ ఆడబోయి రజత్ ఔటయ్యాడు. దాంతో మాక్సీతో కలిసి డుప్లెసిస్ చెలరేగాడు. మూడో వికెట్‌కు 37 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో డీకే 3 సిక్సర్లు, 1 బౌండరీ కొట్టడంతో స్కోరు 192/3కు చేరుకుంది.