IPL 2022 Auction Players not part of Mega Auction: క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచే ఖరీదైన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022 Auction) లో 590 మంది క్రికెటర్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే టోర్నీలో కొందరు స్టార్ క్రికెటర్లు కనిపించరు. ఎందుకంటే వారు టోర్నీకి దూరంగా ఉన్నారు. ఐపీఎల్ 2022కు దూరంగా ఉన్న వారిలో విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ నుంచి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా ఉన్నాడు.
క్రిస్ గేల్: ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన స్టార్ ఓపెనర్లలో ఒకడు. గత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన గేల్ కేవలం 193 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది ఏపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
జో రూట్: ప్రపంచంలో మేటి ఆటగాళ్లలో ఒకడైన జో రూట్ 2016లో 15 మిలియన్ రూపాయల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చినా ఏ జట్టు అతడ్ని తీసుకోలేదు. ఆ తర్వాత గత నాలుగేళ్లుగా ఐపీఎల్‌లో రూట్ ఆడలేదు. ఈ ఏడాది జనవరిలో, ఈసారి వేలంలో పాల్గొనేందుకు ఇష్టం ఉన్నట్లుగా కనిపించాడు. యాషెస్‌లో పేలవ ప్రదర్శనతో ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ ఐపీఎల్ 2022 నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
మిచెల్ స్టార్క్: ఈ వేలంలో పాల్గొనని మేటి బౌలర్లలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఒకడు. కరోనా వైరస్ వ్యాప్తి లాంటి కారణాలు ఒకవైపు, కుటుంబంతో గడపడానికి తాజా సీజన్ నుంచి తప్పుకున్నాడు.
బెన్ స్టోక్స్: ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ కీలక ఆటగాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ కొన్ని మ్యాచ్‌లు ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ గత సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. తోటి ఇంగ్లండ్ స్టార్లలాగే తాను కూడా ఐపీఎల్ 2022కు దూరంగా ఉంటున్నాడు. జాతీయ జట్టు తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు ఫోకస్ చేస్తున్న స్టోక్స్ తాజా సీజన్‌కు దూరం.
కైల్ జెమిసన్: 2021లో జరిగిన వేలంలో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడు కైల్ జెమిసన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అత్యంత ఖరీదైన ఆటగాడు జెమిసన్ ఈ సీజన్ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు.
Also Read: IPL Mega Auction 2022: ఈ ఐపీఎల్ వేలంలో టాప్-5 ఆల్‌రౌండర్లు వీరే, కాసుల వర్షం ఖాయం!