Playoff Qualification Scenario for Chennai Super Kings: రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 పాయింట్ల పట్టికలో పది పాయింట్లతో అయిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు విజయాలు, ఐదు ఓటములతో చెన్నై అయిదు పాయింట్లు సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఇప్పటివరకు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. ఇంకా మూడు ప్లేఆఫ్ స్లాట్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు గెలిచి ప్లే ఆఫ్‌కు చాలా దగ్గర్లో ఉంది. ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే కోల్‌కత్తా మిగిలిన ఉన్న ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే సరిపోతుంది. అంటే కోల్‌కత్తాకు ప్లే ఆఫ్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చెన్నై అవకాశాలు ఇలా..
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై తలపడనుంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐదు విజయాలతో 10 పాయింట్లను కలిగి ఉంది. 16 పాయింట్లు సాధించాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు మ్యాచ్‌ల్లో చెన్నై గెలవాలి. ప్లే ఆఫ్‌లకు అర్హత సాధించడానికి ఒక జట్టుకు సాధారణంగా కనీసం 16 పాయింట్లు అవసరం. లక్నో, హైదరాబాద్ రెండు జట్లు 12 పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి ఈ రెండు జట్లకు రెండు విజయాలు కావాలి. చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్, లక్నోను ఓడించాలని భావిస్తోంది. చెన్నై నాలుగో స్థానంతో ప్లే ఆఫ్‌కు చేరుతుంది. IPL పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న నాలుగు జట్లు IPL ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తాయి.
హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం
రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయంతో హైదరాబాద్ ప్లేఆఫ్‌లో స్థానం కోసం తిరిగి పోటీలో నిలిచింది. నాలుగు స్థానంలో నిలిచినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించే మార్గం ఇప్పటికీ అనిశ్చితిగానే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లో నాలుగు వేర్వేరు జట్లతో తలపడుతుంది. తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, ఎనిమిదో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో హైదరాబాద్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్‌కు చేరుతుంది. హైదరాబాద్ ప్రస్తుతం 6 విజయాలతో 12 పాయింట్లను కలిగి ఉంది. IPL ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి ఒక జట్టు సాధారణంగా కనీసం 16 పాయింట్లు అవసరం. సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్ల మార్కుకు చేరుకోవడానికి మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించాలి. అయినా వారి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడం కొంచెం క్లిష్టంగానే ఉంది. ప్రస్తుతం IPL 2024 ప్లేఆఫ్ రేసులో వివరీతమైన పోటీ ఉంది. తక్కువ స్థానాల్లో ఉన్న జట్లు ఊహించని విజయాలు సాధిస్తే అప్పుడు ప్లే ఆఫ్ రేసు ఇంకా రసవత్తరంగా మారనుంది.