IND vs NZ:  ఊహించని విధంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ మినీ వేలానికి ముందు విడుదల చేసింది. దీనిపై కేన్ బాధపడినట్లు న్యూజిలాండ్ మీడియా పేర్కొంది.


2015 నుంచి విలియమ్సన్ సన్ రైజర్స్ కు ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీ ఈ నిర్ణయం గురించి కేన్ కు తెలియజేసింది. ఈ విషయంతో ముందు అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత హైదరాబాద్ తనను రిలీజ్ చేసినందుకు బాధపడ్డాడు. అని కివీస్ మీడియో  వెల్లింగ్టన్ టైమ్స్ పేర్కొంది. విలియమ్సన్ తన పనిభారాన్ని తగ్గించుకోవడానికి భారత్ తో జరగబోతున్న టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు ఆ కథనం నివేదించింది. అయితే తన టీ20 నైపుణ్యాలపై వస్తున్న సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు విలియమ్సన్ తన నిర్ణయాన్ని మార్చుకుని టీమిండియా సిరీస్ కు సిద్ధమైనట్లు ఆ కథనం సారాంశం. 


ఎస్ ఆర్ హెచ్ విలియమ్సన్ ను రిలీజ్ చేయడానికి కారణాలివే!



  • గత సీజన్ లో కెప్టెన్‌గా విలియమ్సన్ జట్టును క్లిష్టమైన పరిస్థితుల్లో నడిపించడంలో విఫలమయ్యాడు.

  • బ్యాట్స్ మెన్ గానూ రాణించలేకపోయాడు. 13 ఇన్నింగ్సుల్లో 93.50 స్ట్రైక్ రేటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. రూ. 14 కోట్ల తన భారీ ధరకు న్యాయం చేయలేకపోయాడు. 

  • కీలక ఆటగాడైన విలియమ్సన్ విఫలమవటంతో జట్టు కూడా పేలవంగానే ఆడింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 

  • ఐపీఎల్ లో కెప్టెన్ గా విలియమ్సన్ కు ఒక చెడ్డ సీజన్ ఉంది. 2021 లో లీగ్ మధ్యలో వార్నర్ నుంచి సారధ్య బాధ్యతులు తీసుకున్నాడు కేన్. కానీ ఆ సీజన్ లోనూ జట్టు విఫలమైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ యాజమాన్యం మరచిపోయింది. 

  • టీ20 ప్రపంచకప్ లోనూ విలియమ్సన్ అనుకున్నట్లుగా ఆడలేదు. చిన్న జట్టు ఐర్లాండ్ పై మాత్రమే అర్ధశతకం సాధించాడు. అతని స్ట్రైక్ రేటు 130.


ఈ కారణాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ విలియమ్సన్ ను రిలీజ్ చేసి ఉండవచ్చు. అయితే ఈ నిర్ణయం అతన్ని బాధపెట్టింది. ఏప్రిల్ 2022లో విలియమ్సన్ మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి పరుగులు చేయడంలో వెనుకబడ్డాడు. 2022లో టీ20ల్లో ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 12 మ్యాచ్‌ల్లో 382 పరుగులు చేశాడు. ఈ ఏడాదిలో 130 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. భారత్ తో టీ20 సిరీస్ లో 140 స్ట్రైక్ రేటులో పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లింగ్టన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.