Sunrisers Hyderabad vs Gujarat Titans: ఐపీఎల్‌ 2023 సీజన్ 62వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట గుజరాత్ టైటాన్స్ (GT) మొదట బ్యాటింగ్ చేయనుంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తుదిజట్టులో ఒక్క మార్పు చేసింది. డేంజరస్ బ్యాటర్ల గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మార్కో జాన్సెన్ తుది జట్టులోకి వచ్చాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ మాత్రం మూడు మార్పులు చేసింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే సమయంలో విజయ్ శంకర్ గాయపడటంతో సాయి సుదర్శన్ తుది జట్టులోకి వచ్చాడు. దసున్ షనక తన మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో పాటు యష్ దయాళ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.


పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచినా తొమ్మిదో స్థానంలో ఉంటుంది. కానీ ప్లేఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగవుతాయి.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూఖీ, టి నటరాజన్


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, అకేల్ హోసేన్, మయాంక్ దాగర్, నితీష్ రెడ్డి


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్


గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
యష్ దయాల్, శ్రీకర్ భారత్, దర్శన్ నల్కండే, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శివం మావి


గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) మొతేరాను తమ కంచుకోటా మార్చేసుకుంది! హోమ్‌ కండీషన్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంటోంది. అక్కడ పాండ్య సేనను ఓడించడం ప్రత్యర్థులకు సులువేం కాదు. పైగా జట్టులో అంతా ఫామ్‌లో ఉన్నారు. బ్లాస్టింగ్‌ ఓపెనింగ్‌ అందించే ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా ఉన్నారు. మిడిలార్డర్లో ఆదుకొనే.. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya), విజయ్‌ శంకర్‌, అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌ చెలరేగుతున్నారు. రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌ ఫినిషింగ్ టచ్‌ ఇస్తున్నారు. లీగులోనే అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌, స్పిన్నర్‌ గుజరాత్‌కు కొండంత బలం. పవర్‌ప్లేలో కొత్త బంతితో మహ్మద్‌ షమి దుమ్ము రేపుతున్నాడు. మొహిత్‌ శర్మ, పాండ్య, జెసెఫ్ అతడికి అండగా ఉన్నారు. రషీద్‌ ఖాన్‌ పరుగులిస్తున్న వికెట్లు పడగొడుతున్నాడు. అతడికి తోడుగా నూర్‌ అహ్మద్‌ అదరగొడుతున్నాడు. ఇప్పటికే 16 పాయింట్లతో ఉన్న గుజరాత్‌ ఇందులో గెలిస్తే 18 పాయింట్లతో ప్లేఆఫ్‌ కన్ఫామ్‌ చేసుకుంటుంది. ఆఖరి మ్యాచులో గెలుపోటములతో సంబంధం లేకుండా నంబర్‌వన్‌లోనే ఉంటుంది.


మొతేరాలో గుజరాత్‌ను ఢీకొంటున్న సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) గెలవాలంటే అద్భుతమే జరగాలి! ఈ మ్యాచులో విజయం అందుకొంటేనే హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ రేసులో ఉంటుంది. అప్పటికీ మిగతా రెండిట్లో భారీ మార్జిన్‌తో గెలవాలి. మిగతా జట్ల గెలుపోటములూ వీరికి అనుకూలంగా ఉండాలి. అంటే టెక్నికల్‌గా సాధ్యమే కానీ సులభం కాదు! పాపం..! అన్నీ ఉన్నా హైదరాబాద్‌కు ఎక్కడో తేడా కొడుతోంది. అందుకే వరుసగా మూడో సీజన్లోనూ ప్లేఆఫ్‌కు రాకుండా.. ఆఖర్లోనే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. టైటాన్స్‌ తరహాలో బ్లాస్టింగ్‌ ఓపెనర్లు వీరికి లేరు! మిడిలార్డర్లోనూ నిలకడ లేదు. హెన్రిచ్‌క్లాసెన్‌ ఒక్కడే రాణిస్తున్నాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్‌క్రమ్‌ ఫర్వాలేదు. బౌలింగ్‌ పరంగానూ ఘోరంగా ఉంది. ఒక్కరు మాత్రమే పది వికెట్లు పడగొట్టారు. అదే గుజరాత్‌లో నాలుగు పదికి పైగా వికెట్లు తీశాడు. మయాంక్‌ మర్కండే స్పిన్‌ ఓకే. అద్భుతమైన పేసర్లు ఉన్నప్పటికీ సన్‌రైజర్స్‌ వ్యూహాలు ఏమాత్రం బాగాలేవు! మార్‌క్రమ్‌ (Aiden Markram) కెప్టెన్సీ లోపాలు ఇబ్బంది పెడుతున్నాయి.