Gujarat Titans vs Kolkata Knight Riders: ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఒక దాంట్లో గెలిచి, మరో దాంట్లో ఓడిన కోల్‌కతా ఆరో స్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్యా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. దీంతో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఎన్ జగదీషన్, నితీష్ రానా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, డేవిడ్ వైస్, మన్‌దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్(కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
జయంత్ యాదవ్, శ్రీకర్ భరత్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, జాషువా లిటిల్
గడిచిన రెండు సీజన్లుగా ఐపీఎల్ అనుకున్నంత విజయవంతం కాకపోవడంతో ఈ ఏడాది నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చి దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు యత్నిస్తున్న విషయం తెలిసిందే. వైడ్, నోబాల్స్ విషయంలో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేయడంతో పాటు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఇందులో ముఖ్యమైంది. 2023 సీజన్ నుంచి ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’పై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ బీసీసీఐ దీనిపై ఫ్రాంచైజీలను ఫీడ్ బ్యాక్ కోరినట్టు తెలుస్తున్నది.
టూకీగా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం.. తుది జట్టులో ఉండే 11 ఆటగాళ్లతో కాకుండా మ్యాచ్‌కు ముందే ప్రకటించిన సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లలో ఒక్కరిని మ్యాచ్‌లో ఎప్పుడైనా ఫీల్డ్ లోకి పిలిచి ఆడించొచ్చు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ స్థానంలో వచ్చిన ఆటగాడు మళ్లీ గ్రౌండ్ లోకి రావడానికి వీళ్లేదు. అయితే ఈ నిబంధనను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకనో లేక ఎవర్ని ఆడించాలనే అవగాహన లేకపోవడం వల్లో టీమ్స్ ఇప్పటివరకు ఐపీఎల్-16లో ఈ అవకాశాన్ని సక్రమంగా వాడుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. ఫ్రాంచైజీల వద్ద ఫీడ్ బ్యాక్ కోరింది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... ‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఇదివరకు మేం మంచి రెస్సాన్సే అందుకుంటున్నాం. ఇది టీమ్స్‌కు ఫ్లెక్సిబిలిటీని ఇస్తున్నది. ప్రత్యర్థి టీమ్‌కు చివరి నిమిషం వరకూ ఎవరు ఫీల్డ్ లోకి వస్తారో తెలియదు. వారి గేమ్ ప్లాన్ లో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు పది మ్యాచ్‌లు కూడా కాలేదు. మేం కూడా వెయిట్ చేస్తున్నాం. దీనిమీద బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. మేం కూడా టీమ్స్‌ను ఫీడ్ బ్యాక్ అడిగాం. వాళ్ల నుంచి వచ్చే స్పందనను బట్టి దీనిలో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా..? అన్నది నిర్ణయం తీసుకుంటాం..’అని చెప్పాడు.