Shubman Gill Trolls: ఎడిట్ ఆప్షన్ వివాదంతో మొదలై ఏకంగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌నే కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్ మస్క్. ఆపై ఆయన కోకా కోలా కంపెనీని కొనుగోలు చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే మరో సంస్థను కొనుగోలు చేయాలని ఎలాన్ మస్కాన్‌ను టీమిండియా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ కోరాడు. 


ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని కొనుగోలు చేయాలని ఎలాన్ మస్క్‌ను ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చేసిన రిక్వెస్ట్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పుడైనా స్విగ్గీ సంస్థ ఫుడ్‌ను సరైన సమయానికి కస్టమర్లకు డెలివరీ చేస్తుందని తన ట్వీట్‌లో గిల్ రాసుకొచ్చాడు. స్విగ్గీని కొనుగోలు చేయాలని వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ను గిల్ అలా కోరాడో లేదో .. నెటిజన్లు క్రికెటర్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు స్విగ్గీ సైతం గిల్ ట్వీట్‌పై స్పందించింది.






‘హాయ్ శుభ్‌మాన్ గిల్ మీరు చేసిన ఆర్డర్ వివరాలు మాకు తెలపండి. మరోసారి మా ఆర్డర్ వివరాలు సరిచూసుకుంటామని’ స్విగ్గీ స్పందించింది. ఆ తరువాత గిల్ తాను చేసిన ఫుడ్ ఆర్డర్ వివరాలు పంపించినట్లు స్విగ్గీ పేర్కొంది. టీ20 క్రికెట్‌లో నీ బ్యాటింగ్ కంటే మేం ఫాస్ట్‌గా ఫుడ్ డెలివరీ చేస్తున్నామని, ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నువ్వు చిన్న పిల్లోడిలా చేస్తున్నావ్ అని కొందరు నెటిజన్లు గిల్‌ను ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు అయితే నువ్ చిన్న పిల్లోడిలా ప్రవర్తిస్తున్నావ్ అని మస్, గిల్‌కు చెబుతున్నట్లు ట్రోల్ చేశారు.






ఆటగాళ్లకు ఫుడ్ పెట్టండి..
మరికొందరు నెటిజన్లు గిల్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ టీమ్‌ను టార్గెట్ చేస్తూ ఆటాడేసుకుంటున్నారు. మీ ఆటగాళ్లకు కనీసం ఫుడ్ అయినా పెట్టండి అని గుజరాత్ ఫ్రాంచైజీని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. వేగంగా ఎలా డెలివరీ చేయాలో నీ టీ20 బ్యాటింగ్ చూసి మేం నేర్చుకోవాలా అని స్విగ్గీ ఫీలవుతుందని మరో నెటిజన్లు గిల్‌ బ్యాటింగ్‌ను సైతం ట్రోల్ చేశాడు.






Also Read: IPL 2022: కేజీఎఫ్‌ మూడ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌! RCBపై KGFలా ఫైట్‌ ఖాయమంటూ ట్వీట్లు