Rishabh Pant Will Play In IPL 2024: మోడర్న్ డే క్రికెట్ లో క్రేజీ క్రికెటర్లలో ఒకడైన రిషబ్ పంత్ అభిమానులందరికీ గుడ్ న్యూస్. దాదాపుగా ఇంకో 3 నెలలు ఆగితే చాలు, ఈ డ్యాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్‌ను మరోసారి మనం క్రికెట్ గ్రౌండ్ లో చూసేయొచ్చు.
అవును. వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పంత్ మళ్లీ క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్ కన్ఫార్మ్ చేసింది. 2022 డిసెంబర్‌లో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముంబయిలో సర్జరీలు అయ్యాయి. అక్కడ్నుంచి రికవరీ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు పంత్
తనకున్న పట్టుదలతో పంత్ చాలా తొందరగా రికవర్ అయ్యాడు. ప్రస్తుతం రెగ్యులర్‌గా వర్కవుట్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ రిషబ్ పంత్ నిజంగానే ఫుల్ ఫిట్నెస్ సాధించాడా? లేదనే చెప్పుకోవాలి. మరి ఐపీఎల్ లో ఎలా ఆడతాడనే సందేహం వస్తోందా? ఇక్కడే దిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ స్మార్ట్నెస్ తెలుస్తోంది.
పంత్ కోసం ఓ స్పెషల్ స్ట్రాటజీని దిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ రూపొందించినట్టు సమాచారం. అదేంటంటే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వాడుకోవడం. 2023 ఐపీఎల్ నుంచి ఈ రూల్‌ను తీసుకొచ్చారని తెలిసిందే కదా. దీన్ని వాడుకునే పంత్‌ను కేవలం బ్యాటింగ్ సమయంలో దించి సీజన్ అంతా ఆడించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గతేడాది కూడా మనం కొన్ని సందర్భాలు ఈరూల్‌ను అప్లై చేయడం మనం చూశాం. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కు స్వల్ప గాయమైనప్పుడు, ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేవాడు. ఈసారి పంత్ విషయంలో కూడా అదే జరగబోతోందని క్లియర్ గా తెలుస్తోంది. అదే సమయంలో ఈ సీజన్ తమను పంతే లీడ్ చేయబోతున్నట్టు దిల్లీ క్యాపిటల్స్ స్పష్టం చేసింది.
అయితే బీసీసీఐ అధికారులు, ఫిట్నెస్ టీం క్లియరెన్స్ ఇస్తేనే పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడని, లేకపోతే కేవలం బ్యాటింగ్ మీదే ఫోకస్ ఉంటుందని దిల్లీ టీం వెల్లడించింది. ఒకవేళ పంత్ వికెట్ కీపింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటే, ఈ నెల 19న దుబాయ్ లో జరిగే వేలంలో దిల్లీ క్యాపిటల్స్ ఓ వికెట్ కీపర్ బ్యాటర్ ను టార్గెట్ చేయక తప్పదు