Sunrisers Hyderabad vs Delhi Capitals: ఐపీఎల్‌ 2023 సీజన్ 10వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బౌలింగ్ చేయనుంది.


పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి రానుంది. ఈ రెండు జట్లలో ఏదైనా భారీ తేడాతో గెలిస్తే ఏకంగా ఆరో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, నటరాజన్.


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్


ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్, ఖలీల్ అహ్మద్, ప్రవీణ్ దూబే


ఐపీఎల్‌లో ఈరోజు (ఏప్రిల్ 29వ తేదీ) రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడి, ఐదు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయాయి. ఈ జట్లు మరో మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్ రేసులో వెనుక బడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల పోరు మధ్య హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చే కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి.


టీ20 క్రికెట్‌లో భువనేశ్వర్ కుమార్ పైన డేవిడ్ వార్నర్ రికార్డు బాగా లేదు. భువీ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ కేవలం 71 స్ట్రైక్ రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగాడు. డేవిడ్ వార్నర్ కనీసం 40 బంతులు ఆడిన బౌలర్లలో అత్యంత తక్కువ స్ట్రైక్ రేట్ భువీ మీదనే ఉంది.


ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి వేగంగా పరుగులు సాధించారు. కుల్‌దీప్‌ యాదవ్‌పై ఎయిడెన్ మార్క్రమ్ స్ట్రైక్ రేట్ 245 కాగా, రాహుల్ త్రిపాఠి 200 స్ట్రైక్ రేట్‌తో కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో చితక్కొట్టారు.


ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ కేవలం 22 బంతుల్లోనే మనీష్ పాండేను 4 సార్లు పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో మనీష్ పాండే స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే. 2022 నుండి టీ20 క్రికెట్‌లో ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైక్ రేట్ 140కు పైగా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ 141, హెన్రిచ్ క్లాసెన్ 145 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను చిత్తు చేస్తున్నారు.