GT vs KKR Sunil Narine IPL 2023 Record: IPL 2023 39వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ ప్రత్యేక రికార్డును త్వరలో సాధించగలడు. ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ విసిరే విషయంలో రవిచంద్రన్ అశ్విన్‌ను దాటే అవకాశం ఉంది. అయితే దీని కోసం నరైన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది.


ఐపీఎల్‌లో ఇప్పటివరకు సునీల్ నరైన్ 1468 డాట్ బాల్స్ బౌలింగ్ చేశాడు. ఈ విషయంలో అతను మూడవ స్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 192 మ్యాచుల్లో 1491 డాట్ బాల్స్ వేశాడు. భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానంలో ఉన్నాడు. 153 మ్యాచుల్లో 1532 డాట్ బాల్స్ వేశాడు. ఐపీఎల్ వెబ్‌సైట్ ప్రకారం సునీల్ నరైన్ ప్రస్తుతం అశ్విన్‌కు 23 డాట్ బాల్స్ దూరంలో ఉన్నాడు. తర్వాతి రెండు, మూడు మ్యాచ్‌ల్లో నరైన్ ఈ రికార్డును చేరే అవకాశం ఉంది.


ముఖ్యంగా ఈ సీజన్‌లో కోల్‌కతా ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. ఈ సమయంలో అతను కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. కాగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో సునీల్ నరైన్ ప్రదర్శన చూస్తే, అతను కూడా యావరేజ్‌గానే ఉన్నాడు.


నరైన్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో అతను ఆరు వికెట్లు తీశాడు. నరైన్ ఓవరాల్ ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ బాగుంది. 156 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1038 పరుగులు చేశాడు. దీంతో పాటు 158 వికెట్లు తీశాడు. 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో నరైన్ నుంచి కోల్‌కతా మంచి ఆటతీరును ఆశించనుంది.


ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లు
భువనేశ్వర్ కుమార్ - 153 మ్యాచ్‌లు, 1532 డాట్ బాల్స్
రవిచంద్రన్ అశ్విన్ - 192 మ్యాచ్‌లు, 1491 డాట్ బాల్స్
సునీల్ నరైన్ - 156 మ్యాచ్‌లు, 1468 డాట్ బాల్స్
హర్భజన్ సింగ్ - 163 మ్యాచ్‌లు, 1314 డాట్ బాల్స్


కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మార్క్ చేరుకున్నాడు. అయితే లీగ్ చరిత్రలో 1000 పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా సునీల్ నరైన్ నిలిచాడు. ఓవరా‌ల్‌గా లీగ్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో ఆటగాడు అయ్యాడు. గతంలో డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా ఈ ఫీట్ సాధించారు.


లక్నో సూపర్ జెయింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 1000 రన్స్, 100 వికెట్లు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు నరైన్. మరోవైపు వరుసగా మూడు సీజన్లలో 20కి పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ నరైన్. ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాడు గతంలో 2012, 2013, 2014 సీజన్లలో 20కి పైగా వికెట్లు పడగొట్టాడు. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించాడు.


ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లాడిన సునీల్ నరైన్ 1003 పరుగులు చేయడంతో పాటు 24.75 సగటుతో 151 వికెట్లు సాధించాడు. అయితే ఐపీఎల్ 2022లో మాత్రం నరైన్ ఆశించిన మేర రాణించకపోవడం కేకేఆర్ విజయావకాశాలను దెబ్బతిస్తోంది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లలో నరైన్ 8 వికెట్లు తీయగా.. బ్యాట్‌తో కేవలం 49 పరుగులు చేశాడు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చేసిన 22 పరుగులే ఈ సీజన్‌లో నరైన అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఓపెనర్‌గా దిగి పరుగులు రాబట్టగల నరైన్‌ను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపడంతో ప్రభావం చూపలేకపోతున్నాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో నరైన్‌ను రూ.6 కోట్లకు దక్కించుకుంది.