CM Revanth Reddy Saw Ipl Match In Uppal: హైదరాబాద్ ఉప్పల్ (Uppal) క్రికెట్ స్టేడియంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సందడి చేశారు. హైదరాబాద్ - చెన్నై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో స్టేడియానికి చేరుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేశ్ తో కలిసి ఆయన మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం మొత్తం క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. సీఎం రేవంత్ రెడ్డిని చూసిన క్రికెట్ అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. అలాగే, టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా మ్యాచ్ వీక్షిస్తున్నారు. అభిమానుల కేరింతలతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.


Also Read: KCR: 'ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే?' - రైతులు, చేనేతల్ని ప్రభుత్వం ఆదుకోకుంటే వెంట పడతామని గులాబీ బాస్ వార్నింగ్