Sunrisers Hyderabad vs Chennai Super Kings:   ఉప్పల్‌ వేదికగా  చెన్నైతో హైదరాబాద్‌  తలపడుతోంది. టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో  భీకర బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన చెన్నై జట్టు బ్యాటింగ్ కు దిగనున్నారు. అలాగే బలంగా ఉన్న సన్‌రైజర్స్‌ బ్యాటర్లు బౌలింగ్ చేయనున్నారు. ఇరు జట్లు  హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌  స్టేడియంలో ఎంత విధ్వంసం సృష్టిస్తారో అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైజాగ్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఐపీఎల్‌లోనే తొలి ఓటమి చవిచూసిన చెన్నై సూపర్‌కింగ్స్‌... ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. తలా ధోనీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండడడంతో  అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   చెన్నై జట్టు అభిమానులతో స్టేడియం పసుపుమయంగా మారింది.  సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తఫిజర్ ఇప్పటికే ఆటకు  దూరం కాగా.  ఇప్పుడు  పతిరణ కూడా ఆడటం లేదని కెప్టెన్ రుతురాజ్‌ టాస్ తరువాత వెల్లడించాడు. దీంతో  జట్టులోకి మొయిన్ అలీ, తీక్షణ, ముకేశ్‌ చౌదరి వస్తున్నారు.


బ్యాటర్ ల జోరు.. 


ఈ ఐపీఎల్లో  277 పరుగులతో విధ్వంసం సృష్టించినా హైదరాబాద్‌... ఈ మ్యాచ్‌లో మరోసారి భారీ స్కోరు చేసి విజయాలు బాట పట్టాలని చూస్తోంది.  2016లో తన తొలి ఐపీఎల్‌ సీజన్‌లో 17 వికెట్లతో సత్తా చాటిన  ముస్తాఫిజుర్ రెహ్మాన్‌... ఎనిమిదేళ్ల తర్వాత  ఇప్పుడు కూడా చెన్నైకి కీలక బౌలర్‌గా ఉన్నాడు. అయితే ఎంతటి బౌలర్‌ను అయినా ధాటిగా ఎదుర్కోగల బ్యాటర్లు సన్‌రైజర్స్‌కు ఉన్నారు. అభిషేక్ శర్మ ఇదే టెంపోను  కొనసాగిస్తే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు. ట్రావిస్ హెడ్ ఎంత విధ్వంసకర బ్యాటరో చెన్నైతో పాటు అభిమానులకు కూడా బాగా తెలుసు. ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ మంచి టచ్‌లోకి వస్తే చెన్నై బౌలర్లకు తిప్పలు తప్పకపోవచ్చు. మరోవైపు  శివమ్‌ దూబే రూపంలో చెన్నైకి ఓ మంచి హిట్టర్‌ ఉన్నాడు. డారిల్ మిచెల్ కూడా భారీ సిక్సర్లను అవలోకగా కొట్టగలడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్‌రైజర్స్‌ జట్టులో వానిందు వానిందు హసరంగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్రాన్ మాలిక్‌ని తుది జట్టులోకి తీసుకోవాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ భావిస్తోంది. మాలిక్‌ వేగం సన్‌రైజర్స్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉమ్రాన్‌ మాలిక్ జట్టులోకి వస్తే మయాంక్ అగర్వాల్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.


రికార్డుల్లో ఆధిపత్యం చెన్నైదే, కానీ హైదరాబాద్ తగ్గేదేలే..


 చెన్నై సూపర్ కింగ్స్- హైదరాబాద్‌ మధ్య ఇప్పటివరకూ 20 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్‌ 15 మ్యాచ్‌లు గెలవగా... సన్‌రైజర్స్ హైదరాబాద్  5 మ్యాచ్‌లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ - హైదరాబాద్ మధ్య ఏ మ్యాచ్ కూడా ఫలితం లేకుండా ముగియలేదు. గత మ్యాచ్‌ 2023 సీజన్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో  హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్ని సాధించింది. హైదరబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌  52 మ్యాచులు ఆడగా SRH 31 మ్యాచ్‌లు గెలిచింది, 20 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.