తొలి బంతికి వికెట్ తీసింది వీరే...
ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్.... 30 సార్లు పడిపోయింది. ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ పడటం ఇది 31వ సారి. ఇప్పటి వరకు, లసిత్ మలింగ, ఉమేష్ యాదవ్, డిర్క్ నాన్స్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఐపీఎల్ మ్యాచ్‌లో రెండుసార్లు మొదటి బంతికే వికెట్లు తీశారు. IPL 2023 సీజన్‌లో ముగ్గురు బౌలర్లు ఈ ఘనతను సాధించారు. గత సీజన్‌లో మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ట్రెంట్ బౌల్ట్‌లు కూడా ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆరంభించారు.
సోహైల్ తన్వీర్‌తో ఆరంభమై...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి బౌలర్ సోహైల్ తన్వీర్, 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన్వీర్ తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తన్వీర్... పార్థివ్ పటేల్ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఇప్పటివరకూ లసిత్ మలింగ, ఉమేష్ యాదవ్, డిర్క్ నాన్స్, మహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్, భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి బంతికే రెండుసార్లు వికెట్లు తీశారు. ప్రవీణ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్, బ్రెట్ లీ, ఇషాంత్ శర్మ, దీపక్ చాహర్, లక్ష్మీపతి బాలాజీ, జయదేవ్ ఉనద్కత్, జగదీష్ సుచిత్, అశోక్ దిండా, కెవిన్ పీటర్సన్, అల్ఫోన్సో థామస్, మార్లోన్ శామ్యూల్స్, సోహైల్ తన్వీర్, జోఫ్రా ఆర్చర్, పాట్ కమిన్స్, పాట్ కమిన్స్, వాస్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట‌్ తీశారు.