PBKS vs SRH IPL 2024 Head to Head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్  2024(IPL2024) లో  33వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(PBKS)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) తలపడనుంది. ముల్లన్‌పూర్‌లో  కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ కొత్త స్టేడియంలో  పంజాబ్ కింగ్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడడం ఇదే తొలిసారి. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్.. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 200 పరుగులను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలని పంజాబ్‌ పట్టుదలగా ఉంది.  హైదరాబాద్‌ కూడా గత మ్యాచ్‌లో చెన్నైపై విజయం సాధించింది.  సీఎస్‌కే స్కోరు 165 పరుగులను హైదరాబాద్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గత మ్యాచులో గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్నాయి. హోంగ్రౌండ్‌లో అద్భుతంగా ఆడుతున్న హైదరాబాద్‌... ఇతర మైదానాల్లో రాణించలేక పోవడం పెద్ద అవరోధంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఈ సవాల్‌ను హైదరాబాద్‌ ఎలా అధిగమిస్తుందో చూడాలి. 


హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
ఐపీఎల్‌లో పంజాబ్, హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు ఆడగా.. హైదరాబాద్‌  14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. మొహాలీలో ఇరు జట్లు ఆరు మ్యాచులు ఆడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచుల్లో గెలవగా... పంజాబ్‌ కింగ్స్‌ రెండు మ్యాచుల్లో గెలిచింది. హైదరాబాద్‌లో ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచులు జరగగా... హైదరాబాద్‌ రికార్డు స్థాయిలో ఏడు సార్లు విజయం సాధించగా.... పంజాబ్‌ ఒకే మ్యాచ్‌ గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచుల్లో హైదరాబాద్‌ మూడు మ్యాచులు గెలవగా.. పంజాబ్‌ రెండు గెలిచింది. గత ఏడాది రెండు జట్లూ ఒక్కో మ్యాచ్‌ను ఆడగా, ముంబైలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్‌-హైదరాబాద్‌ మ్యాచులలో డేవిడ్ వార్నర్ 700 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 24 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 18 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ పోటీలో ముందుంది. పంజాబ్‌పై హైదరాబాద్‌ ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది.



పిచ్‌ రిపోర్ట్‌:
ముల్లన్‌పూర్ పిట్‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మ్యాచ్‌ గేమ్ సాయంత్రం ప్రారంభం కానున్నందున మంచు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.  సాయంత్రం ఉష్ణోగ్రత దాదాపు 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి తేమ 18-19 శాతం ఉంటుంది.
పంజాబ్‌ జట్టు( అంచనా): 
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్ (కెప్టెన్‌), సామ్ కుర్రాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.


హైదరాబాద్‌ జట్టు( అంచనా): హెన్రిచ్ క్లాసెన్ , ఐడెన్ మార్క్రామ్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి