IPL 2023 Opening Ceremony: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించే TATA IPL 2023  చాలా ఘనంగా ప్రారంభమైంది. గతేడాది సంబరాలకు మించి ఓపెనింగ్ సెరెమోనీ జరిగింది. తమన్నా భాటియా, రష్మిక మండన్నలు నరేంద్రమోదీ స్టేడియాన్ని ఉర్రూతలు ఊగించారు.


ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తెలుగు పాటల గురించి. పుష్ప సినిమాలో ‘ఊ అంటవా ఊఊ అంటవా’ పాటకు తమన్నా స్టెప్పులేస్తే...స్డేడియం అంతా విజిల్స్ వేసింది. రష్మిక ‘సామీ సామీ’ గ్రేస్ మూమేంట్ కు క్రికెటర్లలో సైతం జోష్ నిండింది. ఆస్కార్ కొట్టిన ‘నాటు నాటు’ పాట కూడా ఓపెనింగ్ వేడుకల్లో హైలైట్ గా నిలిచింది.


IPL 2023 ఓపెనింగ్ సెర్మనీలో, ప్రముఖ గాయకుడు అర్జీత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో అదరగొట్టాడు. ఈ ప్రారంభోత్సవ వేడుకను అర్జీత్ సింగ్ 'కేసరియా' అనే సూపర్‌హిట్ పాటతో ప్రారంభించారు. అర్జీత్ సింగ్ కేసరియా పాటకు డ్యాన్స్ చేయమని అభిమానులను కోరాడు. అయితే ఇది మాత్రమే కాకుండా అతను చాలా హిట్ పాటలను కూడా పాడాడు. అర్జీత్ సింగ్ పాటలకు అభిమానులు డ్యాన్స్ చేయకుండా ఆపుకోలేకపోయారు. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ కూడా అర్జీత్ సింగ్ పాటలను షేర్ చేసింది.


సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, అర్జీత్ సింగ్ భారీ అభిమానుల మధ్య తన ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. అదే సమయంలో స్టేడియంలో భారీ సంఖ్యలో అభిమానులను చూడవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలను అర్జీత్ సింగ్ తనదైన శైలిలో ప్రారంభించాడని క్యాప్షన్‌లో రాశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఐపీఎల్ పండగ ప్రారంభం అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ కాయిన్‌ను గాల్లోకి ఎగరేశాడు. ధోని హెడ్స్ ఎంచుకున్నాడు. కానీ టెయిల్స్ పడింది. దీంతో టాస్ గుజరాత్‌కు దక్కింది.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్


సబ్‌స్టిట్యూట్స్ (వీరి నుంచి ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
ఆర్ సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్


సబ్‌స్టిట్యూట్స్ (వీరి నుంచి ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
తుషార్ దేశ్‌పాండే, సుభ్రంషు సేనాపతి, షేక్ రషీద్, అజింక్య రహానే, నిషాంత్ సంధు